Business

పెరిగిన బంగారం ధరలు-వాణిజ్యం

పెరిగిన బంగారం ధరలు-వాణిజ్యం

* బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు ఏప్రిల్ 1 నుంచి రాకెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కరోనా కేసులు భారీగా పెరగడమే అని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది కూడా కరోనా సమయంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈసారి కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నేడు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇండియన్ బులియన్, జెవెల్లెర్స్ అసోసియేషన్ ప్రకారం దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ.46,917 నుంచి రూ.47,555కు పెరిగింది. అలాగే, నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,976 నుంచి 43,560కు పెరిగింది. అంటే ఒక్క రోజులో సుమారు రూ.600 పెరిగింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. కరోనా ఉద్ధృతి.. సంబంధిత ఆంక్షలు, లాక్‌డౌన్‌ల నేపథ్యంలో మదుపర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఫలితంగా ఉదయం 47,940 వద్ద ప్రతికూలంగా ప్రారంభమైన సెన్సెక్స్‌ ఓ దశలో 1,470 పాయింట్లు కుప్పకూలి 47,362 వద్ద కనిష్ఠాన్ని తాకింది. ఇక 14,306 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన నిఫ్టీ 426 పాయింట్లు దిగజారి 14,191 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. తర్వాత రెండు సూచీలు కాస్త కోలుకున్నప్పటికీ నష్టాల నుంచి మాత్రం గట్టెక్కలేకపోయాయి. చివరకు సెన్సెక్స్‌ 882 పాయింట్లు కోల్పోయి 47,949 వద్ద ముగియగా.. నిఫ్టీ 258 పాయింట్లు నష్టపోయి 14,359 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.85 వద్ద నిలిచింది.

* దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో టీకాల ఉత్పత్తి పెంచే దిశగా కేంద్ర చర్యలు చేపట్టింది. టీకా తయారీ సంస్థలు అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరించుకునేందుకు రుణాలు మంజూరు చేసింది. ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా కొవిషీల్డ్‌ను ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ)కు కేంద్రం రూ.3 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. అలాగే దేశీయంగా కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్న భారత్‌ బయోటెక్‌కు రూ.1,500 కోట్ల రుణం మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తాన్ని అతి త్వరలో ఆయా సంస్థలకు విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

* ప్రతి ఒక్కరికి జీవితంలో ఫై ఎదగాలని ఉంటుంది. దానికోసం మన దగ్గర ఉన్న శక్తి సామర్ధ్యలైన చదువు, జ్ఞానం, వినయం, నమ్మకం వంటి వాటిని ఆయుధాలుగా ఉపయోగించుకోవాలి. జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదగాలి. ప్రతి మెట్టు ను చూసుకుంటూ వెళ్ళాలి. తొందరపాటు పనికి రాదు. అవసరమైన మేరకు, తిరిగి చెల్లించే సామర్ధ్యం , చెల్లించ గలనన్న నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే రుణం తీసుకోవాలి. రుణదాత ఆశయం తన సొమ్ము తో కొంత వడ్డీ ఆదాయం కూడా లభిస్తుందని మనకు సొమ్ము ఇస్తారు. కానీ పక్షంలో మన దగ్గర ఉన్న ఆస్తులను అమ్మైనా తన సొమ్మును వసూలు చేసుకుంటాడు. అందువల్ల మనం అవసరం ఉన్న మేరకే కొద్ది మొత్తంలో రుణం తీసుకోవాలి.