Movies

అనుష్క అనుభూతి

అనుష్క అనుభూతి

గొప్ప విజయాల్ని అందుకోవాలి..పేరుప్రఖ్యాతలు రావాలని తాను ఏ రోజు కోరుకోలేదని అంటోంది అనుష్క. అన్ని తెలుసుననే భావనతో కాకుండా నిత్యవిద్యార్థిగానే ఉండటానికి తాను ఇష్టపడతానని చెబుతోంది. గత కొంతకాలంగా సినిమాల ఎంపికలో నిదానంగా అడుగులు వేస్తోంది అనుష్క. సినిమాల పరంగా తన ప్రాధామ్యాల గురించి ఆమె మాట్లాడుతూ ‘స్టార్‌గా కాకుండా ప్రేక్షకురాలిగానే ఆలోచిస్తూ కథల్ని వింటా. మంచి సినిమా చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి కథ వినే సమయంలో నాలో ఉద్భవించాలి. అలాంటి ఫీల్‌ను ఇచ్చే కథల్ని ఎంచుకుంటా. కమర్షియల్‌ ఇండస్ట్రీలో కథానాయికలకు కొత్తదనంతో కూడిన పాత్రలు దొరకడం అరుదే. కొన్ని సార్లు కథ, పాత్ర చిత్రణలో నవ్యత లేకపోయినా దర్శకుడు, హీరోలు ఎవరనేదానికి ప్రాముఖ్యతనిస్తూ సినిమాల్ని అంగీకరిస్తా’ అని చెప్పింది