NRI-NRT

టాంటెక్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

TANTEX Blood Drive Under Lakshmi Paleti

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం రక్తదాన శిబిరము 17న ఫ్రిస్కోలో నిర్వహించారు. టాంటెక్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తొలిసారిగా నిర్వహించారు. కార్యక్రమానికి సహకరించిన వారికి అధ్యక్షురాలు లక్ష్మీ పాలేటి ధన్యవాదాలు తెలిపారు. వాలంటీర్లు కీర్తి కొండ, గీతాంజలి కోడూరు,తిరుమలయ్య కొండ, రమేష్, కోడూరి కృష్ణారెడ్డి, ఉదయ్ నిడగంటి, సరిత ఈదర, కార్యవర్గ సభ్యులు ఉమా మహేష్ పార్నపల్లి, శరత్ యెర్రం, కళ్యాణి తడిమేటి, నీరజా కుప్పాచి, చంద్ర పొట్టిపాటి, రఘునాథ్ కుమ్మెత, డా. పవన్ పామదుర్తి, వెంకట్ ములుకుట్ల తదితరులు సహకరించారు.