Movies

మళ్లీ వస్తున్న మమతా మోహన్‌దాస్

మళ్లీ వస్తున్న మమతా మోహన్‌దాస్

‘యమదొంగ’, ‘చింతకాయల రవి’, ‘కింగ్‌’లాంటి సినిమాల్లో నటించి అలరించిన నాయిక మమతా మోహన్‌దాస్‌. ప్రస్తుతం ఆమె ‘లాల్‌బాగ్‌’ అనే చిత్రంలో నటిస్తోంది. ప్రశాంత్‌ మురళీ పద్మనాభన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ పతాకంపై రాజ్ జకారియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన తెలుగు పోస్టర్‌ని విడుదల చేశారు. ఐటీ, థ్రిల్లర్‌ నేపథ్యంగా వస్తోన్న చిత్రంలో నందినిరాయ్, సిజోయ్ వర్ఘిస్, అజిత్ కోషీ తదితరులు నటిస్తున్నారు. రాహుల్‌ రాజ్‌ సంగీతం స్వరాలు అందిస్తుండగా వనమాలి పాటలు సమకూరుస్తున్నారు. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ మధ్య మమతా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఫోరెన్సిక్’. ఓటీటీ వేదికగా తెలుగులోనూ విడుదలైంది. ఇందులో ఆమె ఐపీఎస్‌ అధికారిగా కనిపించింది.