Politics

నేను బతికే ఉన్నాను

నేను బతికే ఉన్నాను

లోస్‌సభ మాజీ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ మృతిచెందినట్లు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. అసత్య వార్తలను నమ్మొద్దని పేర్కొన్న సుమిత్రా మహాజన్‌ (78) ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ఆడియో టేప్‌ విడుదల చేశారు. సుమిత్రా మహాజన్‌ మృతిచెందారని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ సంతాపం ప్రకటిస్తూ గురువారం ట్వీట్‌ చేశారు. కొన్ని మీడియా సంస్థలు సైతం ఇదే వార్తను తప్పుగా ప్రచారం చేశాయి. భాజపా నేతల విమర్శల అనంతరం శశిథరూర్‌ సహా పలువురు తమ ట్వీట్లను తొలగించారు. తాను మరణించానో లేదో ధ్రువీకరించుకోకుండా ప్రకటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన మహాజన్‌.. కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ స్పీకర్‌ ఈ అంశాన్ని పరిశీలించాలని కోరారు.