Business

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై RBI నిషేధం-వాణిజ్యం

అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై RBI నిషేధం-వాణిజ్యం

* జపాన్ కార్ల తయారీ సంస్థ ‘హోండా కార్స్’ ఇకనుంచి పూర్తిగా విద్యుత్ కార్ల తయారీ వైపు మళ్లనున్నది. భూతాప నివారణ కోసం పెట్రోల్ లేదా డీజిల్ లేదా గ్యాస్ కార్ల ఉత్పత్తికి స్వస్తి పలుకనున్నది. ఉత్తమ విద్యుత్ కార్లను తయారు చేయడానికి హోండా కార్స్ కార్యాచరణ ప్రారంభించింది. ఇటీవలే ప్రొటోటైఫ్ మోడల్ భవిష్యత్ ఎలక్ట్రిక్ కారు ఎస్‌యూవీ ఈ ని ఆవిష్కరించింది. సరిగ్గా మరో 19 ఏండ్లకు పెట్రోల్, డీజల్ ఆధారిత కార్ల తయారీకి ఫుల్ స్టాప్ పెట్టనున్నది.

* అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్పొరేషన్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ‌ల‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. వీటి చెల్లింపు వ్యవస్థ డేటా నిల్వ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ కొత్త దేశీయ క్రెడిట్ కార్డులను వినియోగదారులకు జారీ చేయకుండా నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. అయితే కార్డ్ నెట్‌వర్క్‌లపై ఆంక్షలు ప్రస్తుత వినియోగదారులపై ప్రభావం చూపదని తెలిపింది. దేశంలోని భారతీయ వినియోగదారుల డాటా, ఇతర సమాచారాన్ని భద్రపరచడానికి నిబంధనలను ఉల్లంఘించడంపై రిజ‌ర్వ్‌ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.

* కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌తో సమీప భవిష్యత్తులో దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ డిమాండ్‌ క్షీణించే రిస్కులు ఉన్నాయని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌-రా) ఒక నివేదికలో తెలిపింది. ప్యాసింజర్‌ వాహనాల విభాగం అమ్మకాలు పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టేస్తుందని పేర్కొంది. అయితే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునే కొద్దీ వాణిజ్య వాహనాలకు (సీవీ) డిమాండ్‌ 2021–22 ద్వితీయార్థంలో మెరుగుపడొచ్చని నివేదిక పేర్కొంది. ఎకానమీకి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం పలు తీసుకునే పలు చర్యలు కూడా సీవీల విక్రయాలు..ముఖ్యంగా మీడియం, హెవీ సీవీల అమ్మకాలకు దోహదపడగలవని తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ విక్రయాలు మొత్తం మీద 14 శాతం క్షీణించాయి. ప్యాసింజర్‌ వాహన విక్రయాలు 2 శాతం, సీవీల అమ్మకాలు 21 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 13 శాతం పడిపోయాయి. 2021 మార్చి గణాంకాలు చూస్తే పీవీలు మినహా రిటైల్‌ విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించడం చూస్తే కన్జూమర్‌ సెంటిమెంటు ఇంకా పూర్తిగా మెరుగు పడినట్లు కనిపించడం లేదని ఇండ్‌-రా నివేదికలో తెలిపింది.

* రెండో దశలో కరోనా మహమ్మారి ఉధృతి దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. తాజాగా ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) పరిశోధన సంచలన నివేదిను విడుదల చేసింది.రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమదవుతున్న క్రమంలో ఒకవేళ దేశంలో మూడో వేవ్‌ వస్తే తట్టుకోవడం చాలా కష్టం అంటూ తాజా నివేదికలో తెలిపింది. ఇందుకు అమెరికా జపాన్ వంటి దేశాలలో థర్డ్‌ వేవ్‌ సృష్టించిన విలయాన్ని గుర్తు చేసింది. కరోనావైరస్ కేసులకు సంబంధించి రెండవ వేవ్ కంటే మూడవ వేవ్ పీక్ ఘోరంగా ఉందని రుజువు చేసిందని నివేదిక పేర్కొంది. అలాగే మే మూడవ వారానికి కరోనా వేవ్‌ పీక్‌ దశకు చేరుకుంటుందని అంచనావేసింది. అంతేకాదు లాక్‌డౌన్లకు బదులుగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడమే ప్రత్యామ్నాయమని వెల్లడించింది.