DailyDose

శానిటైజర్ తాగి ఏడుగురు మృతి-నేరవార్తలు

శానిటైజర్ తాగి ఏడుగురు మృతి-నేరవార్తలు

* మహారాష్ట్రలోని యావత్మల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం దొరక్క శానిటైజర్‌ తాగి ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యావత్మల్‌ జిల్లాలోని వాణి ప్రాంతానికి చెందిన ఏడుగురు వ్యక్తులు మద్యానికి బానిసయ్యారు. ప్రస్తుతం మద్యం దొరక్కపోవడంతో సదరు వ్యక్తులు హ్యాండ్‌ శానిటైజర్‌ను తాగారు. దీంతో ఆ ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారంతా కూలీలుగా పోలీసులు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

* మచిలీపట్నం జైలు నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్‌, గురునాథాన్ని తరలించనున్నారు.సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్ల సహా ముగ్గురిని అరెస్టు చేశారు.ఈ కేసులో ముగ్గురికి అనిశా కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

* గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో  10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటన సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు వద్ద చోటు చేసుకుంది.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

* దంతేవాడ జిల్లాలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు.భాన్సీ- బచేలి మార్గంలో విశాఖ వెళ్తున్న రైలును మావోయిస్టులు నిలిపివేశారు.రైలు నుంచి ప్రయాణికులను దింపి పట్టాలను మావోయిస్టులు తొలగించారు.అనంతరం ఇంజిన్, రెండు బోగీలను మావోలు పడేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళకు గురయ్యారు.ఈ నెల 26న మావోయిస్టులు భారత్ బంద్‎ను జయప్రదం చేయాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

* టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ కొడుకు తండ్రికే షాకిచ్చాడు. రవీంద్ర కత్తి చేతపట్టుకోవడంతో తండ్రి శ్రీరామ్‌ తలపట్టుకున్నాడు. ఇప్పుడీ ఫోటో వైరల్‌ గా మారింది.

* ఆస్పత్రుల వద్ద దారుణమైన పరిస్థితులు.బాధితుల నుంచి వేలకు వేలు గుంజుతున్న అంబులెన్స్ డ్రైవర్లు.

* గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్ట్ వద్ద సాధారణ తనిఖీల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో తరలిస్తున్న షుమారు 6 లక్షల విలువైన తెలంగాణ మద్యం స్వాధీనం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు