Movies

రెండో డోస్ తీసుకున్న రమ్యకృష్ణ

రెండో డోస్ తీసుకున్న రమ్యకృష్ణ

క‌రోనా సెకండ్ వేవ్ మ‌రింత విజృంభిస్తుండ‌డంతో చాలా మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. రీసెంట్‌గా ర‌మ్య‌కృష్ణ సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంది. గ‌త నెల‌లో ఫ‌స్ట్ డోస్ తీసుకున్న ర‌మ్య తాజాగా సెకండ్ డోస్ తీసుకున్న‌ట్టు పేర్కొంది. అలానే త‌న అభిమానులు, శ్రేయోభిలాషులు అంద‌రిని వ్యాక్సిన్ తీసుకోమ‌ని, బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు మాస్క్ త‌ప్ప‌ని స‌రిగా ధ‌రించాల‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం ర‌మ్య‌కృష్ణ త‌న భ‌ర్త కృష్ణ వంశీ తెర‌కెక్కిస్తున్న రంగ‌మార్తాండ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తుంది.