Food

వేడి పదార్థాలతో కరోనా నుండి రక్షణ

వేడి పదార్థాలతో కరోనా నుండి రక్షణ

వైరస్ బారిన పడిన వారు కూడా కోవిడ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు.

వేడి పదార్థాలు తీసుకోవడం మంచిది
కోవిడ్ వ్యాప్తి మరింత తీవ్రమవుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలంతా వీలైనన్ని సార్లు గోరు వెచ్చని నీరు, గ్రీన్ టీ, అల్లంటీ, ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే మంచిది. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన ఆహార, పానీయాలను తీసుకోవటం ఎంత మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.

వైద్యం మరియు కౌన్సిలింగ్ చాలా అవసరం
చాలా మంది వాట్సప్, యూట్యూబ్, ఫేస్బుక్ వేదికగా వస్తున్న సమాచారం ఆధారంగా సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కరోనా గురించి అనుమానాలున్నా, కోవిడ్ సోకినా తప్పనిసరిగా నిపుణుల సలహాలు, కౌన్సిలింగ్ తీసుకోవాలి. తదనుగుణంగానే మందులు వాడాలి.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 104 కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. బాధితులకు ఊరట కల్పిస్తూ ఇళ్ల నుంచే వైద్య సేవలు పొందేలా 104 కాల్‌ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరింత ఆధునీకరించింది. కోవిడ్ కు సంబంధించి ఎలాంటి సమస్యలైనా ఫోన్‌లోనే సూచనలు, సలహాలు, మందులు సూచించేందుకు వీలుగా పెద్ద ఎత్తున వైద్యులను అందుబాటులోకి తెచ్చింది. 104 నంబర్ కు కాల్ చేసి కోవిడ్ కు సంబంధించిన సమాచారంతోపాటు ఆస్పత్రుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు.