Politics

భాజపా నేతల బట్టలు విప్పించిన తెరాస నేతలు-నేరవార్తలు

భాజపా నేతల బట్టలు విప్పించిన తెరాస నేతలు-నేరవార్తలు

* వరంగల్ లో 34వ డివిజన్ లో కషాయం వస్త్రాలు ధరించిన బీజేపీ పార్టీ నేతల బట్టలు విప్పించిన టిఆర్ ఎస్ నేతలు.

* ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో భర్త పోస్టింగ్‌ చేసిన ఫలితం బ్యారీ సాహిత్య అకాడమీ నామినేటెడ్‌ పదవి నుంచి భార్య నఫీసా మిశ్రియాను తొలగించారు. ప్రజా ప్రభుత్వంలో విమర్శలకు అవకాశం ఉందని అయితే దేశప్రధాని పట్ల అత్యంత కఠోరమైన, చట్ట వ్యతిరేకమైన పోస్టింగ్‌లను సోషల్‌మీడియాలో మీ భర్త పం పారని, దేశ ప్రధాని చావును కోరేటటువంటి భార్య అకాడమీలో సభ్యులుగా కొనసాగడం సరికాదని సభ్యత్వం నుంచి తొలగిస్తున్నామని బ్యారీ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సాక్ష్యంతోపాటు ఆదేశాలు చేశారు. పోస్టింగ్‌ను పరిశీలించాక ఇటువంటి వారిని ప్రోత్సహించరాదని నిర్ణయం తీసుకున్నామని అకాడమీ రిజిస్టర్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానిని ఏకవచనంతో సంబోధిస్తూ అవహేళనగా పోస్టు చేసిన లుక్మాన్‌ అ డ్యార్‌కు వ్యతిరేకంగా మంగళూరు పోలీసులకు బీజేపీ ముఖ్యుడు ఫజల్‌ అసైగోళి కోణాజి ఫిర్యాదు చేశారు. లుక్మాన్‌ అడ్యార్‌ వ్యక్తి స్వాతంత్య్రం పేరిట దేశ ప్రధానిని ఏకవచనంతో సంబోధించారని, వీధులలో నరకయాతన అనుభవించి ప్రాణాలు కోల్పోయేలా ప్రార్థించాలనే అర్థం వచ్చేలా పోస్టింగ్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు సాయం చేసేందుకు సిద్ధం గా ఉన్న తరుణంలో ఇటువంటి పోస్టింగ్‌లు సరికాదని పేర్కొన్నారు.

* కోవిడ్-19 మహమ్మారి విలయం నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు లేదా ఇతర విధాలుగా సాయం కోరేవారిపై చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కారంగా పరిగణిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రజల గళాన్ని విందామని, సమాచారాన్ని అణచిపెట్టవద్దని కోరింది. మన దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు 70 ఏళ్ళనాటివని, ప్రస్తుత ప్రొసీడింగ్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, రాష్ట్ర ప్రభుత్వాలను కానీ విమర్శించడానికి కాదని వివరించింది. కేవలం ప్రజల ఆరోగ్యం పట్ల మాత్రమే తాము శ్రద్ధ చూపుతున్నామని, తప్పొప్పులను నిర్ణయించేందుకు కాదని స్పష్టం చేసింది.

* అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల్ చెరువు వేములపాడు ణ్ హైవే గెస్ట్హౌస్ వద్ద కారు బైకు డి ఇద్దరు వ్యక్తులు మృతి.

* అనంతపురం జిల్లా ముదిగుబ్బ తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన రైతు గోపాల్ నాయక్ నుండి రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా విఆర్ఓ చంద్ర శేఖర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు.

* ఇజ్రాయెల్‌లో విషాదం చోటుచేసుకుంది.ఇజ్రాయెల్‌లోని మౌంట్‌ మెరెన్‌ పవిత్ర స్థలం వద్ద తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో 40 మంది మృతి చెందగా..పలువురు గాయపడ్డారు.యూదుల పండగ లాగ్‌ బౌమర్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు వేలాది మంది ఒక్కచోట చేరారు.ఈ సమయంలో మౌంట్ మెరెన్‌లోని పైకప్పు కూలడంతో తొక్కిసలాట జరిగినట్లు సమాచారం.దీని గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.