DailyDose

చెన్నైలో ₹5కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత-నేరవార్తలు

Five Crores  Worth Sandalwood Caught By Chennai Customs

* 5కోట్లకి పైన విలువైన ఎర్రచందనాన్ని తరలిస్తున్న కంటైనర్లను చెన్నై కస్టమ్స్ స్వాధీనం చేసుకున్నారు. చైనా, టైవాన్ వంటి సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలకు స్మగ్లింగ్ ను అరికట్టేందుకు చెన్నై కస్టమ్స్ జోన్ నిర్దిష్ట మేధస్సుపై పనిచేస్తోంది, అంతరించిపోతున్న ఈ జాతి రెడ్ సాండర్స్ అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్ చైనా లో ఉంది.ప్రిన్సిపాల్ కమీషనర కస్టమ్స్ ఎన్. పార్థిబన్ ఆధ్వర్యంలో…ప్రత్యేక ఇంటెలిజెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ఐఐబి) కింద కస్టమ్స్ అధికారులు ఏర్పడి వివిధ ఇంటెలిజెన్స్ వనరులపై పని చేస్తున్నారు…మొత్తం చెన్నై ఓడరేవు ప్రాంతం, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు (సిఎఫ్ఎస్) మరియు ప్రదేశాల చుట్టూ ఒక వారం పాటు తనికీల నిర్వహించారు.

* కర్నూలు జిల్లాలో ఘోరం సంభవించింది. ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా పేషెంట్లు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కేెఎస్ కేర్ ఆసుపత్రిలో జరిగింది. తోటి రోగులు ప్రాణాలు కోల్పోవడంతో ఇతర పేషెంట్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఇతర ఆసుపత్రులకు వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి వచ్చి తనిఖీలు నిర్వహించారు. వారి సోదాల్లో ఐసీయూలో ఉన్న నాలుగు డెడ్ బాడీలు బయటపడ్డాయి.

* గుంటూరు అడిషనల్ ఎస్పి మూర్తి కామెంట్స్.రెమ్ డెసివిర్ బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారు.బ్లాక్ మార్కెట్ ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టాం.డెకాయ్ ఆపరేషన్ ద్వారా బ్లాక్ మార్కెట్ ముఠాల ఆటకట్టించాం.నర్సరావుపేటలో నలుగురు ముఠాలో ముగ్గురిని అరెస్ట్ చేసి ఎనిమిది ఇంజక్షన్లు స్వాధీనం.

* సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టై…..రిమాండ్‌లో ఉన్న తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్రను అనిశా కస్టడీలోకి తీసుకుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆయన్ను విజయవాడ తరలించారు.