DailyDose

పింఛన్ సొమ్ముతో వాలంటీర్ పరారీ-నేరవార్తలు

పింఛన్ సొమ్ముతో వాలంటీర్ పరారీ-నేరవార్తలు

* కొత్త చెరువు మండలం బైరాపురం గ్రామంలో లక్షా ఐదు వేల రూపాయల పించన్ సొమ్ముతో ఉడాయించిన వాలంటీర్ మధుసూదన్ రెడ్డి.పోలీసులకు ఫిర్యాదు చేసిన సచివాలయం కార్యదర్శి,సిబ్బంది.కేసు నమోదు చేసి వలింటిర్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలిసులు.

* ఏలూరు రెండవ పట్టణం ఫైర్ స్టేషన్ సెంటర్ జిల్లా కోర్టు వద్ద ఉన్న సద్భావన మెడికల్ షాపులో కరోనా రోగులు వినియోగించే పల్స్ ఆక్సీ మీటర్ను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అంతే కాకుండా పల్స్ ఆక్సీ మీటర్ పై విక్రవించే ధరతో పాటు తయారు చేసే సంస్థ పేరు లేనట్లు అదికారులకు వచ్చిన సమాచారంతో. ఉన్నతాధికారుల ఆదేశానుసారం,సద్భావన మెడికల్ దుకాణం పై తనికీలను ఎమ్మార్వో సోమశేఖర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ అబీద్ ఆలీ, ఎం హెచ్ ఓ, గోపాల్ లు నిర్వహించారు, విక్రయాలపై అవకతవకలు జరిగాయని గుర్తింపుతో మెడికల్ షాప్ ని సీజ్ చేసిన అధికారులు, సద్భావన మెడికల్ దుకాణం పై పూర్తి నివేదిక తయారు చేసి కలెక్టర్ కి అందచేస్తామన్నరు,

* అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట గ్రామం సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం కారు డివైడర్ ని కారు అదుపుతప్పి బోల్తా పట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 5 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

* కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి వద్ద డీజే ఆర్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం వంతెనపై నుండి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం. తీవ్రగాయాలు. ఆసుపత్రికి తరలించిన స్థానికులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.