DailyDose

తిరుమలలో అగ్ని ప్రమాదం-నేరవార్తలు

Fire Accident Near Bedi Anjaneya Swamy Asthan Mandapam Tirumala

* బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి ఆస్థాన మండపంలోని దుకాణాలలో అగ్ని ప్రమాదం.

* నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూర్ వద్ద పెను విషాదం..ప్రమాదవశాత్తు ట్రాక్టర్ చేపల చెరువులో బోల్తా పడి 5మంది మృతి..సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.., గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిఐదు మంది మృతితో గ్రామంలో విషాదఛాయలు..

* ప్రగతిభవన్‌లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు.

* భూకబ్జా ఆరోపణల వ్యవహారంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది.

* మెక్సికోలో మెట్రో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం మెట్రో ఫ్లైఓవర్‌ మీది నుంచి రైలు వేగంగా వెళుతున్న సమయంలో హఠాత్తుగా ఫైఓవర్‌ కూలిపోంది. దీంతో రోడ్డుపై వెళ్తున్న కార్లపై మెట్రో రైలు పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు. సహాయక సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్బామ్ స్పందిస్తూ.. మెట్రో రైల్‌ వెళుతుండగా బ్రిడ్జ్‌ కూలిపోవటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. రాత్రి 10.30 సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు వైద్యం అందించాలని అధికారులును ఆదేశించినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.