ScienceAndTech

భారత్ రక్షణ వ్యవస్థకు బ్రిటన్ సహకారం

భారత్ రక్షణ వ్యవస్థకు బ్రిటన్ సహకారం

భారత్‌-బ్రిటన్‌లు రక్షణ రంగ సహకారంలో కీలకమైన ముందడుగు వేశాయి. యుద్ధవిమానాలు, కీలకమైన రక్షణ వ్యవస్థలను ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేయడంపై అంగీకారానికి వచ్చాయి. ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ-బోరిస్‌ జాన్సన్‌లు మంగళవారం వర్చువల్‌గా భేటీ అయి ఈ నిర్ణయాలు తీసుకొన్నారు. భారత్‌ ఉత్పత్తి చేస్తున్న తేజస్‌ ఎంకే2 విమానానికి సంబంధించి సహకారం అందించే అంశంపై అంగీకారానికి వచ్చారు. ముఖ్యంగా ఇది ఇంజిన్‌కు సంబంధించిన అంశంపై సహకారం ఉండే అవకాశం ఉంది. అంతేకాదు నౌకలకు వినియోగించే ప్రొపెల్షన్‌ వ్యవస్థలు, సంక్లిష్టమైన ఆయుధాల అభివృద్ధి పై కూడా దృష్టి పెట్టనున్నారు. దీంతోపాటు బ్రిటన్‌,భారత్‌లోని కీలక పరిశ్రమలు, ప్రయోగశాలలు, విద్యాసంస్థల మధ్య బంధాన్ని మరింత పటిష్ట పర్చనున్నారు.