DailyDose

కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాలు-నేరవార్తలు

కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాలు-నేరవార్తలు

* సైబర్‌ నేరగాళ్లు సామాన్యులనే కాదు.. వీఐపీలనూ వదలడం లేదు. విజయనగరం జిల్లా కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేశారు. ఆయన పేరుతో నకిలీవి సృష్టించి వందలాది మందికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పెట్టారు. కలెక్టర్‌ కదా అని అంతా స్నేహితునిగా అంగీకరించారు. తర్వాత ఒక్కొక్కరికీ మెసెంజర్‌ ద్వారా సంక్షిప్త సందేశాలు వెళ్లాయి. రూ.10 వేలు, రూ.15 వేలు, రూ.25 వేలు కావాలని, స్నేహితుడి ఫోన్‌పే లేదా గూగుల్‌పేకు పంపాలని, మళ్లీ ఆ మొత్తాన్ని రేపు పంపిస్తానని అవతలి వ్యక్తులు కోరారు. కొంతమంది నేరుగా ఈ విషయమై కలెక్టర్‌కు ఫోన్‌ చేసి అడగగా.. అటువంటిదేమీ లేదని, ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు. దీనిపై కలెక్టర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, తన ముఖపుస్తకం ఖాతాను తొలగించానని, సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో ఎవరూ పడవద్దని సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, నిందితుడిని పట్టుకుంటారని తెలిపారు.

* విద్యుదాఘాతం వల్ల చెలరేగిన మంటలతో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమైన ఘటన నగరంలోని ఉప్పల్‌లో ఈ ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన షహజాజ్(38) కంటైనర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన గంగా సాగర్(50) లోకల్ గైడ్‌గా ఉపాధి పొందుతున్నాడు. శంషాబాద్ నుంచి ఉప్పల్ ఐడీఏకు వీరిద్దరూ కార్ల కంటైనర్‌తో బయల్దేరారు. ఈ క్రమంలో మాడ్రన్ బెడ్ ప్రాంతానికి రాగానే ప్రమాదవశాత్తు వీరి వాహనం కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్తు తీగలు కంటైనర్‌పై పడి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. కంటైనర్‌లోని కార్లు సైతం పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరీశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

* ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ.సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కరోనా సోకిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నరేంద్ర తరపు న్యాయవాదులు.నరేంద్ర, గురునాథంకు కోవిడ్ లక్షణాలున్నాయన్న న్యాయవాదులు.ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని హైకోర్టు ఆదేశం. .కోవిడ్ లక్షణాలుంటే గోపాలకృష్ణను చేర్చిన ఆస్పత్రిలో గానీ.. ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించిన హైకోర్టు.కోర్టు ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్ర చర్యలుంటాయన్న హైకోర్టు.

* కడప జువారీ సిమెంట్ కంపెనీ మూసివేత ఆదేశాలను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.

* అనంతపురం నగరంలోని క్యాన్సర్ ఆసుపత్రిలో వరుస మరణాలపై కలెక్టర్ సీరియస్.- ఆక్సిజన్ అందించడంలో విఫలమయ్యారని ఆగ్రహం.- ఆసుపత్రి సూపరింటెండెంట్ భాస్కర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన కలెక్టర్.- ఆక్సిజన్ సరఫాలో లోపాలపై ప్లాంట్ నిర్వాహాకులు వారాశి ఏజెన్సీకి కూడా నోటీసులు.

* గుంటూరు…రాష్ట్ర వ్యాప్తంగా కర్పూ విధించడానికి ప్రభుత్వం జీవో 192ను విడుదల చేసింది.. కలెక్టర్ వివేక్ యాదవ్

* పశ్చిమ బెంగాల్ లో బిజెపి ఏబీవీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దహనాలు, లూటీలు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ బిజెపి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది.

* కఠిన ఆంక్షలు అమలు చేస్తు నాము. అన్ని నందిగామ డి.ఎస్.పి.నాగేశ్వరరెడ్డి సీఐ చంద్రశేఖర్ ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలంగాణ నుంచి ఆంధ్ర బోర్డర్ కి రావాలి అంటే అనుమతి పత్రాలు తప్పనిసరిగా ఉండాలని అత్యవసర సమయంలో తప్ప పత్రాలు లేకుండా రాష్ట్రంలోకి రావద్దు అంటూ డీఎస్పి ఒక ప్రకటనలో తెలిపారు