Health

3.82లక్షల కొత్త కేసులు-TNI కోవిద్ బులెటిన్

3.82లక్షల కొత్త కేసులు-TNI కోవిద్ బులెటిన్

* దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3,82,315 పాజిటివ్‌ కేసులు.. 3,780 మరణాలు నమోదయ్యాయి.ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.కొత్త కేసులతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,06,65,148కి చేరుకుంది.తాజా మరణాలతో మృతులు 2,26,188కి పెరిగారు.ప్రస్తుతం దేశంలో 34,87,229 యాక్టివ్‌ కేసులు ఉండగా.. మొత్తంగా 1,69,51,731 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు.ఇప్పటి వరకు 16,04,94,188 కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.

* విజయవాడ ఇంద్రకీలాద్రిపై కరోనా విజృంభణ. ఎన్ఎంఆర్ గా పనిచేస్తున్న ఆకులహరి కరోనాతో మృతి.

* ఏపీలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత కర్ఫ్యూ అమలు. ఆంధ్ర బార్డర్ గరికపాడు చెక్ పోస్ట్ వద్ద వాహనాలకు నో ఎంట్రీ. అత్యవసర వాహనాలు, గూడ్స్, ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు మాత్రమే అనుమతి.

* కరోనా ఉధృతి కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రమై కాణిపాకంలో స్వామివారి దర్శన వేళలను కుదిస్తున్నట్లు ఈవో వెంకటేశు తెలిపారు.

* చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పాకిక్ష కర్ఫ్యూ అమలులో ఉంది.రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.తిరుపతిలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. తిరుపతిలో కర్ఫ్యూను ఎస్పీ వెంకట అప్పలనాయుడు పర్యవేక్షిస్తున్నారు.ఇప్పటికే దర్శన టికెట్ బుక్‌చేసుకున్న శ్రీవారి భక్తులను అనుమతిస్తున్నట్లు ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు.దర్శన టికెట్లు చూపించి తిరుమలకు వెళ్లవచ్చని స్పష్టం చేశారు.