Business

RBI గవర్నర్ సంచలన ప్రకటన-వాణిజ్యం

RBI Governor Sakthi Kantha Das Statement On COVID19

* కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు.ముంబయిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో కరోనా పరిస్థితులను ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని చెప్పారు.‘సూక్ష్మ, మధ్యతరగతి సంస్థలపై రెండో దశ కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం.ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యాపారం చేయాలో అందరూ నేర్చుకున్నారు.భౌతిక దూరం పాటిస్తూ వ్యాపారాలు చేయడం అలవాటు చేసుకున్నారు’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ అన్నారు.

* APSRTC రాష్ట్రంలో కర్ఫ్యూ దృష్ట్యా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని ఆర్టీసీ రద్దుచేసింది.దూరప్రాంతాలకు నడిచే అన్ని బస్సు సర్వీసుల రిజర్వేషన్లను రద్దు చేసింది.ఇవాళ్టి నుంచి ఈనెల 18 వరకు ముందస్తు రిజర్వేషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.బస్టాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు అనుగుణంగా అప్పటికప్పుడు బస్సులు సమకూర్చనున్నారు.మధ్యాహ్నం 12 లోపు గమ్యస్థానాలకు చేరుకునే దూరప్రాంత బస్సులకే అనుమతి ఇస్తున్నారు.మధ్యాహ్నం 12 తర్వాత గమ్యస్థానాలు చేరుకునే దూరప్రాంత బస్సు సర్వీసులను రద్దు చేశారు.ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి ఇవ్వాలని నిర్ణయించారు.

* సాంకేతిక కంపెనీలు ఇక భారత్‌లో పన్ను చెల్లించేలా రంగం సిద్ధమైంది. సరికొత్త లేదా సవరించిన చట్టం ప్రకారం.. ప్రవాస టెక్‌ కంపెనీలకు గరిష్ఠ పన్ను ఆదాయ పరిమితి రూ.2 కోట్లుగా; గరిష్ఠ వినియోగదార్లు 3 లక్షలుగా ప్రభుత్వం సోమవారం నోటిఫై చేసింది. అంతకంటే ఎక్కువ ఆదాయం, వినియోగదార్లు ఉంటే పన్ను చెల్లించాలన్నమాట.

* బంగారం ధర కాస్త దిగొచ్చింది. రూ.317లు తగ్గడంతో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,382గా ఉంది. అంతర్జాతీయంగా పసిడి లోహం ధరల్లో క్షీణతే ఇందుకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. నిన్న 10గ్రాముల పసిడి ధర రూ.46,699గా ట్రేడైన విషయం తెలిసిందే. మరోవైపు, వెండి ధరలు భారీగా పెరిగాయి. కిలో వెండి ధర 2,328లు పెరగడంతో 70,270కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1776 యూఎస్‌ డాలర్లుగా ట్రేడ్‌ అవుతుండగా.. ఔన్సు వెండి ధరలు 26.42డాలర్లుగా ఉంది. ఇకపోతే, హైదరాబాద్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 48,350 (పన్నులతో కలిపి)గా ఉండగా.. వెండి కిలో రూ.73,890గా ట్రేడ్‌ అవుతోంది.