Movies

సునీతకు వణుకు పుట్టించిన దర్శకుడు

సునీతకు వణుకు పుట్టించిన దర్శకుడు

ఓ చిత్రానికి డబ్బింగ్‌ చెబుతున్న సమయంలో దర్శకుడు చేసిన పనితో తాను మొదట షాకయ్యానని ప్రముఖ గాయని సునీత అన్నారు. ” గతంలో ఓ చిత్రానికి డబ్బింగ్‌ చెప్పడం కోసం స్టూడియోకి వెళ్లాను. స్టూడియో లోపలకి వెళ్లగానే ఆ చిత్ర దర్శకుడు.. ‘సునీత మేడమ్ నేను మీకు పెద్ద అభిమానిని. నా సినిమాకి మీరు డబ్బింగ్ చెప్పడం నాకెంతో ఆనందంగా ఉంది ’ అని అన్నాడు. కొన్ని సీన్లు డబ్బింగ్‌ చెప్పిన అనంతరం ఆయన నన్ను ‘సునీత గారు’ అని పిలవడం ప్రారంభించారు. నేను పెద్దగా పట్టించుకోలేదు. మరికొద్దిసేపటి తర్వాత ‘సునీత’ అని పిలిచారు. అలా కొంత డబ్బింగ్‌ పూర్తయ్యే సరికి ఆయన నన్ను .. ‘అరేయ్‌, అమ్మా, బుజ్జి, కన్నా’’ అనడంతో నేను షాక్‌ అయ్యాను. ఈయనేంటి మేడమ్‌ దగ్గర ప్రారంభించి ఉన్నట్టుండి కన్నా, బుజ్జి అంటున్నాడు? ఇప్పుడు నేను ఎలా స్పందించాలి? అనుకున్నాను. అదృష్టం కొద్ది ఆ తర్వాత మళ్లీ ఆయన్ని కలవలేదు’ అని సునీత ఆనాటి సంగతుల్ని గుర్తుచేసుకుని నవ్వులు పూయించారు.