Business

బ్యాంకు వేళల్లో మార్పు. పెరిగిన బంగారం ధర-వాణిజ్యం

బ్యాంకు వేళల్లో మార్పు. పెరిగిన బంగారం ధర-వాణిజ్యం

* రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో బ్యాంకులు పనిచేసే వేళలో మార్పులు చేశారు. ఉదయం 9.00గంటల నుంచే బ్యాంకులు పనిచేయాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్ఎల్‌బీసీ) కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బ్యాంకుల బిజినెస్‌ సమయం ఉదయం 9.00నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుందని, సాయంత్రం 4.00గంటల వరకు అవి తమ పనిచేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, కర్ఫ్యూ నుంచి పోర్టులకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వెసలుబాటు ఇస్తూ వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

* బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.439 పెరిగి రూ.46,680గా నమోదైంది. అలాగే వెండి కూడా కిలో రూ.1,302 పెరిగి 69,511కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధరలకు మద్దతు లభించడంతో దేశీయంగా ధరలు పెరిగాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ తెలిపింది.

* ప్రభుత్వరంగ జీవిత బీమా కంపెనీ ళీఛ్ వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనుంది. ఇకపై శనివారం ళీఛ్ కార్యాలయాలు పనిచేయబోవని ఆ సంస్థ పబ్లిక్‌ నోటీసులో పేర్కొంది. మే 10 నుంచి ఐదు రోజుల పని విధానం అమల్లోకి రానుంది. ఎల్‌ఐసీ ఉద్యోగులకు సంబంధించి కొన్ని డిమాండ్ల పరిష్కారంలో భాగంగా ప్రతి శనివారం సెలవు ప్రకటించాలన్న డిమాండ్‌కూ కేంద్రం ఏప్రిల్‌ 15న ఆమోదం తెలిపింది. దీంతో మే 10 నుంచి సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ళీఛ్ కార్యాలయాలు తెరుచుకోనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేయనున్నాయని ఎల్‌ఐసీ పేర్కొంది. పాలసీదారులు, ఇతర భాగస్వామ్యపక్షాలు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.

* దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు లాభాల్లో ట్రేడింగ్‌ను ముగించాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 272 పాయింట్లు పెరిగి 48,949 వద్ద, నిఫ్టీ 106 పాయింట్లు పెరిగి 14,724 వద్ద స్థిరపడ్డాయి. ఆర్‌ సిస్టమ్స్‌ ఇంటర్నెట్‌, ఇగార్షి మోటార్స్‌, కోఫోర్జ్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌, మాస్టెక్‌ లిమిటెడ్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఆగ్రోటెక్‌ ఫుడ్‌, బంధన్‌ బ్యాంక్‌, మార్పిన్‌ ల్యాబ్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌, యారీడజైన్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.