NRI-NRT

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

TANA Prapancha Sahitya Vedika India 75th Independence Day

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించనున్నారు. దేశభక్తి పూర్వక సాహిత్యంతో కూడిన 75 లలిత గీతాలను, 75 మంది గీతరచయితలు రచించగా, 75 మంది గాయనీ గాయకులు వీటిని గానం చేసిన అనంతరం ఆగస్ట్ 15న అంతర్జాలంలో ఆవిష్కరిస్తామని తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ .. ఆసక్తి ఉన్న రచయితలు 1. భారతీయ సంస్కృతి 2. దేశభక్తి స్ఫూర్తి 3. జాతీయోద్యమ సంఘటనలు 4. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం అనే ఏ ఇతివృత్తంతో అయినా ఒక పల్లవి, రెండు చరణాలకు మించని లలిత గీతాలను ఎ4 సైజులో వచ్చేటట్లుగా వ్రాసి, ఈ రచన మీ సొంతమని రాతపూర్వకంగా ధృవీకరిస్తూ, మీ చిరునామా, ఫోన్ నెంబర్ తెలియపరుస్తూ మే 20, 2021 గడువు తేదీ లోగా +91-91210 81595కు WhatsApp ద్వారా పంపాలని కోరారు. నిర్ణాయక సంఘం ఆయా రచనలను పరిశీలించి, ఎంపికైన రచయితలకు జూలై 15న తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు.