Fashion

భోజనం చేశాక స్నానం చేయవద్దు

భోజనం చేశాక స్నానం చేయవద్దు

* చాలామంది భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తారు. ఇలా చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్‌, కడుపులో మంట వంటివి వస్తాయి. అంతగా స్నానం చేయాలనుకుంటే భోజనమయ్యాక ఓ గంట ఆగి చేయండి.
* అన్నం తిన్నాక ఏవైనా పండ్లు తినడం అలవాటా? ఇదీ తప్పే. ఎందుకంటే తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోపు పండ్లను తినడం వల్ల ఆ పోషకాల్ని కోల్పోతాం. కాబట్టి పండ్లను తినాలనిపిస్తే భోజనం తర్వాత గంటకి తినొచ్చు.
* భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. తిన్న వెంటనే వ్యాయామం కూడా చేయకూడదు. టీ, కాఫీలు తాగకూడదు. అలా అని తిన్న వెంటనే కూర్చోకండి. మెల్లిగా కాసేపు అటూ ఇటూ నడవండి చాలు.