Health

కరోనా భయంతో బావిలో దూకిన టీచరు-TNI బులెటిన్

కరోనా భయంతో బావిలో దూకిన టీచరు-TNI బులెటిన్

* రాష్ట్రంలో కోవిడ్ రెడ్ జోన్ లో 5 జిల్లాలు. గుంటూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు, శ్రీకాకుళం. వీటిలో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో గుంటూరు జిల్లా. 25రోజుల్లో 17వేలకు పైగా కోవిడ్ కేసుల నమోదు. రేపు ఉదయం నుఒచి మధ్యాహ్నం మెడికల్ షాపులు. మధ్యాహ్నం రెండు గంటలవరకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కరోనా నేపథ్యంలో రోడ్డుపైకి వస్తున్న వాహన దారులు ప్రతి ఒక్కరు మెడికల్ షాపుకి అని చేప్పి వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు అనవసరంగా పిల్లలను బైటికి పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* ఏపీకి మరో 1.43 లక్షల కోవాగ్జిన్ డోసులు. భారత్ బయోటెక్‌కు చెందిన 1.43 లక్షల టీకాలు రాక – ఏపీ అన్ని జిల్లాలకు టీకాలు పంపనున్న అధికారులు.

* వేలూరు జిల్లా లత్తేరి సమీపంలోని పాట్టియనూరు గ్రామానికి చెందిన  ఏలుమలై(40) మేల్‌మాయిల్‌లోని ప్రభుత్వ పాఠశాల లో డ్రాయింగ్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి గత వారం రోజులుగా జలుపు, దగ్గు లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేసుకున్నాడు. పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఈనెల 3న వేలూరు అడుక్కంబరై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కోసం చేరాడు.  అయితే బుధవారం ఉన్న ఫలంగా మాయమయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఆసుపత్రి సమీపంలోని చిరుకరుంబూరులోని వ్యవసాయ బావిలో మృతదేహం బావిలో తేలుతుండటంతో స్థానికులు గమనించి వేలూరు పోలీసులకు సమాచామిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది బావిలోని మృతదేహాన్ని బయటకు తీసి విచారణ చేపట్టగా.. కరోనా భయంతో పరారైన ఏలుమలైగా గుర్తించారు.

* దేశమంతా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా భాదితులు వారి బంధువులు ఆస్పటల్ లో బిల్లులు కట్టలేక ఎంతో వేయ ప్రయాసలు పడుతూ ఆసుపత్రుల యాజమాన్యాలు కి తమకున్న ఆస్తులు అమ్ముకుంటూ బిల్లులు చెల్లిస్తున్న పరిస్తుతులు చూస్తున్నాం. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. కరోనా కోరల్లో చీక్కుకొని చనిపోయిన మృతదేహాలు తీసుకోని స్మశానానికి వెళితే అక్కడ కూడా 15 వేల రూపాయల నుంచి 20 వేల వరకు వసూలు చేస్తు నిలువు దోపిడి చేస్తున్నారు.

* ఈ నెల 16 వరకు కేటాయింపులు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అన్ని రాష్ట్రాలకు 53 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను కేటాయించింది. మహారాష్ట్రకు 11.57 లక్షలు, ఏపీకి 2.35 లక్షలు, తెలంగాణకు 1.45 లక్షల ఇంజక్షన్లను కేటాయింపు చేసింది. రెమ్‌డెసివిర్‌ కొరత లేకుండా రాష్ట్రాలు ప్రణాళిక రూపొందించుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు సరిగ్గా పంపిణీ అయ్యేలా చూడాలని ఆదేశించింది. గుర్తిపు పొందిన ప్రైవేటు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా కూడా తీసుకోవచ్చని కేంద్రం సూచించింది.