Business

ఇండియాలో సెంచరీ దాటిన పెట్రోల్ ధర-వాణిజ్యం

ఇండియాలో సెంచరీ దాటిన పెట్రోల్ ధర-వాణిజ్యం

* దేశంలో మరోసారి 100 దాటిన పెట్రోల్ ధర…రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో సెంచరీ కొట్టిన పెట్రోల్..ఈ ఏడాదిలో పెట్రోల్ ధర 100 దాటడం ఇది రెండోసారి.

* గన్నవరం విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసర లాండింగ్.బెంగుళూరు నుండి బాగ్ డోగ్ర వెళ్లే విమానంలో ఓ మహిళకు అస్వస్థత.మహిళా ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో గన్నవరంలో అత్యవసర లాండింగ్.గన్నవరం విమానాశ్రయం నుండి అంబులెన్స్ సాయంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు..

* దేశంలో కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా విస్తరిస్తోంది.మరోవైపు ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్‌, కోవాగ్జిన్‌, స్పుత్నిక్-వి అనే మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా డిమాండ్‌కు తగినంత సరఫరా లేక వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ జైడస్ క్యాడిలా సంస్థ ఊరట నందించే కబురు చెప్పింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ జైకోవ్-డి భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతులకు దరఖాస్తు చేయనుంది. అంతేకాదు త్వరలోనే అనుమతులు వస్తాయనే ధీమా వ్యక్తం చేస్తోంది.

* కోవిడ్‌–19 కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రమ్‌ ట్రయల్సే కారణమంటూ వస్తున్న వదంతులపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ తప్పుడు వార్తలని, వాటిని నమ్మరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలతో పాటు కొన్ని ప్రాంతీయ మీడియాలో కూడా కోవిడ్‌–19 కేసుల ఉధృతికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణమంటూ వార్తలు చక్కర్లు కొడుతుండటం తమ దృష్టికి వచ్చినట్లు సీవోఏఐ శుక్రవారం తెలిపింది.