DailyDose

పుట్టా మధుకు ₹900కోట్ల అక్రమాస్తులు-నేరవార్తలు

Crime News - Putta Madhu Illegal Assets Range To 900Crores

* పుట్టా మధు అక్రమంగా 900 కోట్లు సంపాదించినట్లు ఆరోపిస్తూ దర్యాప్తు సంస్థలకు కాంగ్రెస్ నేత మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు సతీష్ ఈ మేరకు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పై ఐటి, సీబీఐ, ఇడి అధికారులకు గతంలో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో ఉన్న వివరాలివి…జూబ్లిహిల్స్ లో సినీ నటుడు శ్రీ హరి ఇంటి పక్కనే 5 కోట్ల విలువ చేసే ఇల్లును మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కొనుగోలు చేశారు.తల్లి పేరుతో చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కోట్లు వసూళ్లు చేశారు.పుట్టా మధు 900 కోట్లు అక్రమంగా సంపాదించారు.అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ లలో 100 కోట్ల విలువైన పెట్టుబడులు హోటల్స్, నిర్మాణ రంగంలో పెట్టుబడి పెట్టారు.ముంబైలోని ఆది రాజ్ కన్స్ట్రక్షన్స్ పేరుతో పుట్ట మధు 50 కోట్ల పెట్టుబడులు పెట్టారు.కాటారం మండలం ఒడిపిలవంచలో 2 కోట్లు విలువ చేసే 50 ఎకరాల వ్యవసాయ భూమి సంపాదించారు.పలివెల మండలం మహాదేవపూర్ లో నాలుగు కోట్లు విలువ చేసే 100 ఎకరాల వ్యవసాయ భూమి సంపాదించారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పుట్ట మధు తన క్లాస్ మేట్ శ్రీనివాస్ బినామీ పేరుతో భువన సురయి డెవలపర్స్ లో 100 కోట్లతో పెట్టుబడులు పెట్టారు.తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఇసుక క్వారీ ని పుట్టా మధు సోదరుడు పుట్ట సత్యనారాయణ పేరుతో నడుపుతున్నారు. దీని టర్నోవర్ 50 కోట్ల వరకు ఉంటుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భవిత శ్రీ చిట్ ఫండ్స్ 20 బ్రాంచేస్ లో పుట్ట మధు 50 కోట్ల పెట్టుబడులు పెట్టారు.మంథని మండలం విలోచవరం లో 60 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు.మహారాష్ట్ర లోని నాగ్ పూర్ లో 40 ఎకరాల ల్యాండ్, దాంట్లో 40 కోట్లతో మెడికల్ కాలేజి నిర్మిస్తున్నారు పుట్టా మధు.పుట్టా మధు అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించిన కేసు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు నాగమణి లు సతీష్ తరుపున వాదిస్తున్నారు… ఈ కేసుతో పాటు పుట్ట మధు పై నమోదైన అనేక కేసులను మంథని పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ కేసు ఇలా అనేక కేసులు వామన్ రావు దంపతులే న్యాయవాదులు గా ఉన్నారు… ఇందులో భాగంగా వారికి ప్రాణహాని ఉందని కూడా పలుమార్లు పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు… ఇందుకు సంబంధించిన ఆడియో సైతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది… మనమందరం గతంలోనే విన్నాం కూడా… మొదటి నుండి హైకోర్ట్ లాయర్ దంపతుల హత్యా కేసులో సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పుట్ట మధు కుటుంబం ఎట్టకేలకు విచారణ ఎదుర్కొంటుండటం హత్యకు సంబంధించి రెండు కోట్ల రూపాయల లావాదేవీ లు కూడా భవిత శ్రీ చిట్ ఫండ్ ద్వారా జరగడం పుట్ట మధు కుటుంబ ప్రమేయాన్ని మరింత బలం చేకూరుస్తోంది.

* ఫిరంగిపురం మండలం వేములూరిపాడు వద్ద బైక్ ను ఢీ కొట్టిన కారు.గత అర్ధరాత్రి చోటుచేసుకున్న ప్రమాదం.బైక్ మీద ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి.మృతులు ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్ళూరుకు చేందినవారిగా గుర్తించిన పోలీసులు.మృతదేహాలు గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు.పరారీలో కారు డ్రైవర్.కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన ఫిరంగిపురం పోలీసులు.

* ఏపి తెలంగాణ సరిహద్దుల్లో…అంబులెన్స్ లను అడ్డుకొంటున్న తెలంగాణ పోలీసులు….తెలంగాణ ఆసుపత్రుల్లో అడ్మిషన్ ఖరారయన రోగులనే అనుమతిస్తామంటున్న తెలంగాణ పోలీసులు.

* కడప జిల్లా మామిళ్లపల్లె సమీపంలో భారీ పేలుళ్ల కేసులో గని యజమాని నాగేశ్వర్‌రెడ్డి, అక్కడ పనిచేసే రఘునాథరెడ్డిని అరెస్ట్‌ చేసినట్లు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పేలుడు పదార్థాలు అన్‌లోడ్‌ చేసే సమయంలో అవి పేలిపోయాయన్నారు. పులివెందుల నుంచి పేలుడు పదార్థాలను తరలించారని చెప్పారు. కారులో వెయ్యికి పైగా జిలెటన్‌ స్టిక్స్‌ తరలించారని.. పేలుడు పదార్థాలు తరలించేందుకు అనుమతి లేదని ఎస్పీ తెలిపారు. అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్పారు.