Movies

తారక్‌కు కరోనా-TNI బులెటిన్

తారక్‌కు కరోనా-TNI బులెటిన్

* కరోనా సెకండ్‌ వేవ్‌తో సాధారణ ప్రజలే కాదు…..సినీ తారలు సైతం వైరస్‌ బారినపడుతున్నారు. తాజాగా స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘తాజాగా చేసిన పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. నేను, నా కుటుంబం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నాం. ఇటీవల నన్ను కలిసిన వారందరు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా’’ -ట్విటర్‌లో ఎన్టీఆర్‌.

* కరోనా మహమ్మారి విజృంభణతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి ఆంక్షలను విధిస్తున్నాయి. ఇందులో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ కూడా లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. కొన్ని అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను పూర్తిగా మూసివేసింది. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలను మాత్రం నేరుగా ఇంటికే (హోం డెలివరీ) చేరవేస్తామని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి లిక్కర్‌ సేవలను అందిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రకటనపై భాజపా మండిపడుతోంది.

* భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం కొనసాగుతున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్య సంస్థ సన్ టీవీ భారీ విరాళం ప్రకటించింది. దేశంలో కొవిడ్ సహాయచర్యలకు రూ.30 కోట్ల విరాళం ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ విరాళాన్ని భారత ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు చేపడుతున్న కొవిడ్ నియంత్రణ, చికిత్స, ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు తదితర అంశాల కోసం అందిస్తున్నట్టు సన్ టీవీ వివరించింది. సన్ టీవీ అధీనంలోని అన్ని మీడియా విభాగాల ద్వారా కరోనా కట్టడిపై అవగాహన కల్పించేందుకు పూర్తి వనరులను వినియోగించనున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. తద్వారా భారత్ లోనూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు.

* కోవిడ్‌ – 19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష. హాజరైన డిప్యూటీ సీఎం (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ (నాని), ఛీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ చైర్‌పర్సన్‌ డా. కే.ఎస్‌. జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం. టీ. కృష్ణబాబు, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌) ఎం. రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంచార్జి ఎ. బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఎ. మల్లికార్జున్, ఏపిఎంఎస్‌ఐడీసీ విసి అండ్‌ ఎండీ విజయరామరాజు, ఇతర ఉన్నతాధికారులు.

* క‌రోనా పేషెంట్ల‌కు క‌నీస‌వైద్య‌సేవ‌లు అంద‌డంలేద‌ని కాకినాడ ఆస్ప‌త్రిలో ద‌య‌నీయ దృశ్యాలు చూసైనా మాన‌వ‌త్వంతో స్పందించండి జగన్ రెడ్డి గారూ అని ట్వీట్ చేస్తే..నాపై ఫేక్ కేసులు పెట్టించారు.

* ఏపీలో టీకా కార్యక్రమానికి పక్కా ప్రణాళిక. ఏపీలోని అన్ని జిల్లాల్లో నేడు, రేపు వ్యాక్సినేషన్ నిలిపివేత.

* కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు యథాశక్తి కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధించాయి.

* ఉరవకొండ పట్టణంలోని వీరశైవ కళ్యాణ మండపంలో సోమవారం జరుగుతున్న వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రధాన కార్యక్రమం.