Health

కర్నూలు కలెక్టర్‌కు కరోనా-TNI బులెటిన్

కర్నూలు కలెక్టర్‌కు కరోనా-TNI బులెటిన్

* కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యఎన్.! కరోనా పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్ళిన వీరపాండ్యన్. ఇటీవల తనను కలిసిన వారందరూ టెస్ట్ నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న వీరపాండ్యన్.

* కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఉత్తర ప్రదేశ్ లో కొందరు గో సేవకులు, గో సంరక్షకులు, స్వయంసేవకులు చేస్తున్న కొత్త ప్రయోగం…. ఉదయం 5 గంటలకు ఆవు పిడకలు, పసుపు, దాల్చిన చెక్క, తిప్పతీగ మరియు కొన్ని వన మూలికల పొగను వీధిలో వ్వాప్తి చేసుకుంటూ వెళుతున్నారు. హనుమాన్ చాలిసా పటిస్తూ ప్రభాత భేరి పేరుతో చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల పట్టణంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టడం వల్ల పలువురు ప్రశంసిస్తున్నారు.

* ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్నది. ఉదయం 10 గంటల తర్వాత రహదారులపై వాహనాల రాకపోకలు దాదాపుగా తగ్గిపోయాయి. మహబూబ్‌నగర్ పట్టణంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొద్దిసేపు లాక్ డౌన్‌ను పరిశీలించారు.

* ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశామని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

* తిరువూరులో కోవిడ్-19 పై ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి, నూజివీడు డిఎస్పీ బి. శ్రీనివాసులు సమీక్ష..

* భారత్‌లో కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి జులై వరకూ కొనసాగే అవకాశముందని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ అంచనా వేశారు.

* గరికపాడు చెక్ పోస్ట్ వద్ద భారీగా వాహనాల రాక.. ట్రాఫిక్​కు అంతరాయం