Health

ఏపీకి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్-TNI కోవిద్ బులెటిన్

ఏపీకి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్-TNI కోవిద్ బులెటిన్

* రాష్ట్రంలో మెడికల్‌ ఆక్సిజన్‌ అవసరాలను తీర్చేందుకు తొలిసారిగా ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏపీకి రానుంది.

* సరిహద్దుల్లో అంబులెన్స్‌లు అడ్డుకోవడంపై ఏపీ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి. తెలంగాణ అధికారులతో మాట్లాడిన సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌. న్యాయపరంగా ముందుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం.

* హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం 14 – 05 – 2021.జిల్లాల వారీగా:- అనంతపురం – 2,213,చిత్తూరు – 2,708, తూర్పుగోదావరి జిల్లా – 3,432,గుంటూరు – 1,733,కడప – 1,460,కృష్ణాజిల్లా – 1,031,,కర్నూలు – 1,213,నెల్లూరు – 1,733,ప్రకాశం – 1,265,విశాఖ – 2,200,విజయనగరం – 899,పశ్చిమ గోదావరి జిల్లా – 1,436,శ్రీకాకుళం జిల్లా – 695.టోటాళ్ – 22,018.

* క‌రోనా క్రైసిస్ చారిటీని ప్రారంభించి ఈ క‌ష్టకాలంలో ఆదుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా క‌రోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త‌పై ప్ర‌జ‌ల్ని జాగ్రత్తగా ఉండాలంటూ వీడియో సందేశం ద్వారా తెలియజేశారు.

* పోలీసుల ఆపడం వల్ల ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో చనిపోయిన కరోనా రోగుల మరణాలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.