Health

ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు-TNI కోవిద్ బులెటిన్

ఖమ్మం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసు-TNI కోవిద్ బులెటిన్

* ఖమ్మం జిల్లాలో బయటపడ్డ బ్లాక్ ఫంగస్ కేసు. మధిర నియోజకవర్గంలోని నేరడ గ్రామానికి చెందిన తాళ్లూరి భద్రయ్యకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి రిఫరల్ చేసిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. ఇటీవల కరోనా వైరస్ నుంచి కోలుకున్న తాళ్లూరి భద్రయ్య.. బ్లాక్ ఫంగస్ లక్షణాలను గుర్తించిన ఖమ్మం ప్రభుత్వ హాస్పటల్ వైద్యులు.

* దేశంలోని 10 రాష్ట్రాల్లో 67శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గణాంకాలను వెలువరించింది. 60ఏళ్లు పైబడిన వారిలో 39.9శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు తెలిపింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసువారిలో 45.5శాతం మందికి; 30 నుంచి 45 ఏళ్ల వారిలో 9.4శాతం; 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కుల్లో 5.2శాతం మందికి టీకాలు ఇచ్చినట్టు పేర్కొంది. 18 నుంచి 44 ఏళ్ల వారిలో 42లక్షల మందికి పైగా టీకాలు వేసినట్టు తెలిపింది. ఇందులో అత్యధికంగా దిల్లీలో 5.26లక్షల మందికి టీకాలు ఇచ్చినట్టు వెల్లడించింది. ఇకపోతే, ఏపీలో 18 నుంచి 44 వారిలో 2624మందికి టీకాలు ఇవ్వగా.. తెలంగాణలో ఆ సంఖ్య 500గా ఉన్నట్టు తెలిపింది.

* కరోనా మహమ్మారిపై జరుపుతున్న పోరాటంలో భాగంగా శనివారం ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతను తట్టుకొని నిలిచేందుకు కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రతిజిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇంటివద్దకే డెలివరీ చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ‘ఢిల్లీ వాసులకు ఈ రోజు నుంచి ఒక ముఖ్యమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ప్రతి జిల్లాలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కోబ్యాంకులో 200 కాన్సంట్రేటర్లు ఉంటాయి. కొవిడ్ బాధితులకు అవసరమైనప్పుడు ఆక్సిజన్ లభించక ఐసీయూల్లో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కొన్నిసార్లు మరణాలు సంభవిస్తున్నాయి. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు ఆక్సిజన్ అవసరమైతే రెండు గంటల్లో మా బృందం వాటిని హోం డెలివరీ చేస్తుంది. ఆసుపత్రుల్లో కోలుకొని వచ్చినవారికి కూడా ఒక్కోసారి ఆక్సిజన్ కావాల్సిన పరిస్థితి వస్తోంది. వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వైద్యులు ఎప్పటికప్పుడు బాధితులను పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే..తక్షణం స్పందిస్తాం’ అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. సహాయం కోసం 1031 నంబర్‌కు కాల్ చేయాలని చెప్పారు. కొద్ది వారాల క్రితం ఢిల్లీలో కొవిడ్ కేసులుపెరగడంతో ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వేధించింది. ఆ అంశం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ఆప్‌ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ..‘నిన్నటితో పోల్చుకుంటే కొత్త కేసులు మరింత తగ్గాయి. ప్రస్తుతం 6,500 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 11 శాతానికి తగ్గింది. దిల్లీలో మరోసారి కరోనా విజృంభించదని ఆశిస్తున్నాం. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం’ అని అన్నారు. ఏప్రిల్‌ 19 నుంచి దిల్లీలో లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

* భార‌త్‌లో ఉన్న కోవిడ్ ప‌రిస్థితిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.భార‌త్‌లో అనేక రాష్ట్రాల్లో క‌రోనా పాజిటివ్ కేసులు ఆందోళ‌న‌ర రీతిలో పెరుగుతున్నాయ‌ని, చాలా మంది హాస్పిట‌ల్ పాల‌వుతున్నార‌ని,మ‌ర‌ణాలు కూడా అధికంగానే చోటుచేసుకుంటున్న‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ గెబ్రియేసిస్ తెలిపారు.ప్ర‌పంచ దేశాల‌కు టెడ్రోస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. మ‌హ‌మ్మారి సోకిన తొలి ఏడాది క‌న్నా.. రెండ‌వ ఏడాది మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా ఉంటుంద‌ని,మ‌ర‌ణాలు ఎక్కువ సంఖ్య‌లో న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న హెచ్చ‌రించారు.

* తిరుచానూరు పద్మావతి కోవిడ్ కేర్ సెంటర్ కు 10,000 రూ! విలువ కలిగిన మెడికల్ సామాగ్రిని డోనేట్ చేస్తున్న ఉపాధ్యాయ దంపతులు వీరు ఎస్ ఆర్ పురం మండలం చిల్ల మాకుల పల్లి జెడ్పి హై స్కూల్ లో పనిచేస్తున్నారు పద్మావతి కోవిడ్ సెంటర్ లో చికిత్స పొంది డిస్చార్జి సమయం లో ఈ సెంటరుకు ఈ మెడికల్ సామాగ్రిని డోనేట్ చేయడం జరిగింది.

* ఏపీకి మరో 4.8లక్షల కొవిషీల్డ్‌ డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి గన్నవరం విమనాశ్రాయానికి చేరుకున్నాయి. వీటిని తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించనున్నారు. అక్కడి నుంచి ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు కేటాయింపులు చేయనున్నారు.