తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సినీప్రియులను అలరిస్తోన్న నయా అందం సంయుక్త మేనన్. ఇప్పటికే తెలుగు మినహా అన్ని దక్షిణాది చిత్రాల్లోనూ మెరుపులు మెరిపించిన ఈ మలయాళీ అందం.. త్వరలో తెలుగు సినీప్రియుల ముందుకు రానుంది. ప్రస్తుతం సాయితేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో ‘రిపబ్లిక్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేయనున్నారు తేజ్. ఇందులో ఆయనకు జోడీగా సంయుక్త సందడి చేయనుందని సమాచారం. ఓ విభిన్నమైన మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.
సంయుక్త సోగసు
Related tags :