Health

కరోనాకు ఎంపీ బలి-TNI బులెటిన్

కరోనాకు ఎంపీ బలి-TNI బులెటిన్

* కరోనాతో కాంగ్రెస్‌ ఎంపీ కన్నుమూశారు. మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ సభ్యుడు రాజీవ్‌ సతావ్‌ (46) ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1974 సెప్టెంబర్‌ 21న పుణెలో జన్మించిన ఆయన కాంగ్రెస్‌ పార్టీలో పలు కీలక పదవులు నిర్వర్తించారు. 2014-2019 మధ్య హింగోలి లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన సతావ్‌.. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉంటూ గుజరాత్ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు..

* గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ పాజిటివ్‌ రోగుల కుటుంబాలు, సహాయకులకు నిత్యాన్నదానం చేస్తామని ఎంపీ రేవంత్‌ రెడ్డి అన్నారు. సోనియాగాంధీ రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి వద్ద వెయ్యి మందికి ఉచితంగా ఆహారం పంపిణీ చేస్తామన్నారు. గాంధీ ఆస్పత్రి వద్ద నిత్యన్నదానం కార్యక్రమాన్ని శనివారం రేవంత్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. లాక్‌డౌన్‌తో బయటికి వెళ్లేందుకు వీలు లేకుండా ఉండడంతో కరోనా బాధితుల సహాయకులకు తినేందుకు భోజనం దొరకడంలేదన్నారు. వీరి కోసం యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

* పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు.పశ్చిమగోదావరి జిల్లాలో తొలిసారి బ్లాక్ ఫంగస్ కేసు…నిడదవోలులోని కొలపల్లి అంజిబాబు అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు.15 రోజుల క్రితం కరోనా నుండి కోలుకున్న అంజిబాబు.ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో డిశ్చార్జ్ అయిన సమయానికే కన్ను వాపు.గత వారం రోజులుగా పెరుగుతున్న కన్ను వాపు.రాజమండ్రి, వైజాగ్ ప్రముఖ ఆసుపత్రుల్లో ఫంగస్ లక్షణాలుగా నిర్ధారణ.కన్ను, ముక్కు, మెదడు కు వ్యాపిస్తుందన్న వైద్యులు.కన్ను వెంటనే తీసేయాల్సి ఉందన్న వైద్యులు, ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు.

* ఆక్సిజన్ ట్యాంకర్స్‌తో వచ్చిన రైలు ఆదివారం న్యూ గుంటూరు రైల్వేస్టేషన్‌కు చేరుకుంది.రైలులో నాలుగు ట్యాంకర్లు వచ్చాయి. 78 టన్నుల ఆక్సిజన్ వచ్చింది.అధికారులు ఆక్సిజన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్నారు.రాష్ట్రానికి 910 టన్నుల ఆక్సిజన్ అవసరమని సీఎం జగన్ కేంద్రానికి ఇప్పటికే లేఖ రాశారు.దీంతో ఈ మేరకు ఆక్సిజన్ వచ్చింది.ట్యాంకర్ల పంపిణీ పర్యవేక్షణ  ఐఏఎస్ అధికారి కృష్ణబాబు చూస్తున్నారు.

* – బెంగళూర్ నుండి తిరుపతి వచ్చిన 16 టన్నుల ఆక్సీజన్ ట్యాంకర్ వాహనానికి గ్రీన్ ఛానెల్ ఏర్పాటు.- జిల్లా సరిహద్దునుండి ఎలాంటి ఆటంకం కలగకుండా వాహనానికి ఎస్కార్ట్ తో తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కి తీసుకొచ్చిన జిల్లా పోలీసులు.

* ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్​గఢ్​, పుదుచ్చేరిలో కరోనా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు.

* రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) 94,550 సాంపిల్స్ ని పరీక్షించగా 24,171 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.

*