Devotional

ఆంక్షల మధ్య తెరుచుకున్న బద్రీనాథ్

ఆంక్షల మధ్య తెరుచుకున్న బద్రీనాథ్

క‌రోనా ఆంక్ష‌ల మధ్య ఉత్త‌రాఖండ్‌లోని బ‌ద్రీనాథ్ ఆల‌యం త‌లుపులు ఈరోజు ఉద‌యం 4:15 నిముషాల‌కు బ్రహ్మముహూర్తంలో తెరుచుకున్నాయి. దేవస్థానం బోర్డు తరపున ఆల‌య ద్వారాలు తెరిచే కార్య‌క్ర‌మం ఘ‌నంగా నిర్వ‌హించారు. ఆల‌యాన్ని 20 క్వింటాళ్ల‌ పూలతో అలంకరించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఆల‌య పూజారులు మాత్ర‌మే హాజ‌రై, పూజ‌లు నిర్వ‌హించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా చార్‌ధామ్ యాత్ర వాయిదా వేస్తున్న‌ట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ గ‌తంలో ప్ర‌క‌టించారు. భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఉంటూ పూజలు చేసుకోవాల‌ని కోరారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని బ‌ద్రీనాథ్ ధామ్ కాంప్లెక్స్, తప్తకుండ్ త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌రిశుభ్ర‌ప‌రిచారు. బద్రీనాథ్ బస్‌బేస్ ప్రాంతంలో పారిశుద్ధ్య ప‌నుల అనంత‌రమే వాహనాలను ధామ్ వైపున‌కు పంపారు. బద్రీనాథ్‌లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంద‌ని బద్రీనాథ్‌కు చెందిన బుర్ద్వాన్ భువన్ చంద్ర తెలిపారు.