DailyDose

అబ్బాయిలకు వల వేస్తున్న మహిళా కానిస్టేబుల్-నేరవార్తలు

అబ్బాయిలకు వల వేస్తున్న మహిళా కానిస్టేబుల్-నేరవార్తలు

* ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామ సమీపంలోని హ్ఫ్ పెట్రోల్ బంకు ఎదురుగా అంబులెన్స్ వాహనం ఢీకొని బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతిచెందాడు తనికెళ్ల గ్రామానికి చెందిన పత్తి తిరుపతిరావు {35} బైక్ పై కొణిజర్లకు వస్తుండగా వైరా నుండి ఖమ్మం వైపు వెళ్తున్న అంబులెన్స్ వాహనం టైర్ పగిలి అదుపుతప్పి బైక్ను ఢీకొనటంతో రామారావు కు తీవ్ర గాయాలై అపస్మారక స్థితి లో ఉండటంతో స్థానికులు ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో కొణిజర్ల పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు

* రెమిడెసివిర్ ఇంజక్షన్ లు బ్లాక్ లో 40 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న ముఠాగుట్టు రట్టయింది. ఈ దంతా సాగిస్తున్న ముఠా సభ్యులు పది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.మరొకరు పరారీలో ఉన్నట్టు గుర్తించారు.వారి వద్ద నుండి 30 రెమిడెసివిర్,11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.కారును సీజ్ చేశారు.సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డిఎస్పీ మోహన్ కుమార్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.పట్టణంలోని కోవిడ్-19 చికిత్స(ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్)కు ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజక్షన్లు ప్రైవేట్ ఆస్పత్రిలో అధిక ధరకు అమ్ముతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సూర్యాపేట పట్టణ సి.ఐ. ఆంజనేయులు సిబ్బందితో కలిసి సోమవారం తెల్లవారుజామున పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో ప్రైవేట్ ఆసుపత్రులపై దాడులు చేశారు.ఈ దాడుల్లో ఆసుపత్రుల మేనేజర్లు,వారితో ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు.ఈ విచారణలో సూర్యాపేట జిల్లా లోని ఆత్మకూరు(ఎస్) గ్రామానికి చెందిన గుడ్డేటి మాధవ రెడ్డి,పందిరి కార్తీక్ రెడ్డి,పెన్ పహాడ్ మండలం భక్తళాపురం గ్రామానికి చెందిన గోపాలదాసు పవన్ కళ్యాణ్,గోపాలదాసు సాయి,మద్దిరాల గ్రామానికి చెందిన వల్లపు నరేష్, నడిగూడెం మండలం రత్నపురం గ్రామానికి చెందిన విమలపంగు రమేష్,నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన నిమ్మనగోటి శ్రీను,సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్ కు చెందిన మద్దెల నర్సింహా రాజు,కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగుండుపాలెం గ్రామానికి చెందిన సుగుణావత్ వినోద్ కుమార్, నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చెన్నమనేని గ్రామానికి చెందిన మద్దిమడుగు రమేష్, త్రిపురారం మండలం పలుగు తండాకు చెందిన పాంగోతు రంగా ముఠాగా ఏర్పడ్డారు.వీరు రెమిడెసివిర్ ఇంజెక్షన్లను కృత్రిమ కొరత సృష్టించి,వాటిని డిమాండ్ ను బట్టి కావాల్సిన వారికి 30 వేలనుంచి 40 వేల వరకు అమ్ముతున్నారు.నిందితుడు మాధవరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సూర్యాపేట శివారులో గల సెవెన్ ఆర్ హోటల్ దగ్గరకు వెళ్లి అక్కడ మనోహర్, సైదాబాబుతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 26 రెమిడెసివిర్ ఇంజక్షన్లను గుర్తించారు.మరో ప్రయివేట్ ఆసుపత్రి వద్దకు వెళ్ళి మేనేజర్,అతనితో ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 4 రెమిడెసివిర్ ఇంజెక్షన్లను గుర్తించారు.వాటిని సూర్యాపేట డ్రగ్ ఇన్స్పెక్టర్ సమక్షంలో పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 12 మంది నిందితుల్లో 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

* విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో గాంధీ విగ్రహం పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి.

* హైదరాబాద్ ఎఆర్ మహిళ కానిస్టేబుల్ హనీ ట్రాప్.డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న మహిళ కానిస్టేబుల్ సంధ్య రాణి.పోలీస్ డిపార్ట్మెంట్ పెరు చెప్పుకొని బెదిరిస్తున్న సంధ్య రాణి.ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ నిర్వహిస్తున్న సంధ్య రాణి.గతంలో ముగ్గురిని పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చిన లేడీ కానిస్టేబుల్.ఇద్దరికి డివోర్స్ ఇవ్వగా మరొక్కరు కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఆత్మహత్య.తాజాగా షాబాద్ మండలం హైతబాద్ కు చెందిన చరణ్ తేజ ను ట్రాప్ చేసిన కానిస్టేబుల్.ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన చరణ్ తేజ ను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వచించి పెళ్లి చేసుకున్న కానిస్టేబుల్.పెళ్లి చేసుకోక పోతే శ్ట్ శ్ఛ్ అట్రాసిటీ కేసు పెడతానని లేకపోతే కలిసి తిరిగిన ఫోటోలు వీడియోస్ బయటపెడ్తానాన్ని బెదిరింపు గత వివాహాలు విషయం తెలికుండా చరణ్ ను నమ్మబలికించి పెళ్లి చేసుకున్న సంధ్య.కానిస్టేబుల్ సంధ్య రాణి ట్రాప్ నుండో నన్ను రక్షించండి అంటూ శంషాబాద్ డిసిపి, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్ లకు ఆన్లైన్ ద్వారా పిర్యాదు చేసిన బాధితుడు.ఒంటరిగా ఉన్న అబ్భయిలకు ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటుంది అంటూ ఫిర్యాదులో పొందుపరిచిన బాధితుడు.సంధ్య రాణి భాదితులు ఎవరైనా ఉంటే ముందుకురావాలని ప్రాధేయపడ్డ బాధితుడు.గతంలో సంధ్య రాణి వరస పెళ్లిళ్ల పై జూబ్లీహిల్స్ పీఎస్ లో పిర్యాదు చేసిన సంధ్యా రాణి తల్లిదండ్రులు.పోలీస్ ఉద్యోగం అన్ని భయపడకుండా ఇష్టం వొచ్చిన వారితో తిరుగుతుంది అన్ని తల్లితండ్రుల స్టేట్మెంట్.ట్రాప్ చేసిన వారిని తన ఇంట్లో కాకుండా సెపరేట్ రూమ్ తీసుకొని బాధితులతో గడుపుతున్న సంధ్య.సంధ్య రాణిని డిపార్ట్మెంట్ నుండి సస్పెండ్ చేసి ఆమె ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని బాధితుని డిమాండ్.

* నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న రాత్రి గుంటూరు నుంచి సికింద్రాబాద్‌ తిరుమలగిరిలోని ఆర్మీ ఆస్పత్రికి ఏపీ సీఐడీ పోలీసులు తీసుకొచ్చారు. ఆర్మీ ఆస్పత్రిలోని ముగ్గురు వైద్యుల బృందం రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. వైద్య పరీక్షలను వీడియోలో చిత్రీకరిస్తున్నారు. అనంతరం పరీక్షల నివేదికను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టు రిజిస్ట్రార్‌ ద్వారా సుప్రీంకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.