అమెరికాలోని పలు నగరాల్లో అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 120 మంది ప్రవాసులు, ఆటా సభ్యులు రక్తదానం చేశారు. 250 మందికి పైగా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. చికాగో, ర్యాలీ, అట్లాంటా నగరాల్లో నిర్వహించిన ఈ శిబిరాల నిర్వహణకు బ్లడ్ డొనేషన్ క్యాంపు కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, బోర్డు అఫ్ ట్రస్టీ డ్ర్.మెహర్ మేడవరం, ఆటా సలహామండలి కమిటీ చైర్ హనుమంత్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ మధు బొమ్మినేని, ట్రస్టీ సాయి సూదిని, మాజీ అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, ట్రస్టీస్ అనిల్ బొద్దిరెడ్డి, ప్రశీల్, కిరణ్ రెడ్డి పాశం, రీజినల్ కోఆర్డినేటర్స్ తదితరులు సహకరించారు. నిర్వాహకులను ఆటా అధ్యక్షుడు భువనేష్ అభినందించారు. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.