NRI-NRT

నాట్స్ ఆధ్వర్యంలో వినూత్నంగా మాతృ దినోత్సవం

NATS Webinar On The Event Of Mothers Day

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) మాతృదినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించింది. 4తరాల మహిళామణులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి మాతృత్వ గొప్పదనాన్ని చాటిచెప్పే విధంగా వేడుకలను నిర్వహించింది. అమ్మ ప్రేమపై రూపొందించిన చిత్రాలకు బహుమతులు అందజేశారు. సభికులు పాటలతో అమ్మ గొప్పదనాన్ని కీర్తించారు. తమ అమ్మలతో పాటు కలిసి చిన్నారులు చేసిన డ్యాన్స్ వీడియోలను ప్రదర్శించారు. అమ్మలతో కలిసి చిన్నారులు చేసిన డబ్ స్మాష్‌ అలరించింది. పిల్లలు మాతృమూర్తి మీద వ్రాసిన కవితలు ఈ వెబినార్లో చదివి వినిపించారు. నాట్స్ జాయింట్ సెక్రటరీ జ్యోతి వనం అనుసంధానకర్తగా వ్యవహరించారు. మహిళల కోసం నాట్స్ చేపడుతున్న కార్యక్రమాలను నాట్స్ వైస్ ఛైర్మన్ అరుణ గంటి వివరించారు.