Business

₹2లక్షల29వేల కోట్లతో ఏపీ బడ్జెట్-వాణిజ్యం

₹2లక్షల29వేల కోట్లతో ఏపీ బడ్జెట్-వాణిజ్యం

* ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ ఒకరోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. అసెంబ్లీలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా తెలిపారు. ఈ బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు బడ్జెట్‌లో వెచ్చించారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కన్నబాబు ప్రవేశపెట్టున్నారు. సభ ప్రారంభం కాగానే పలువురు మాజీ ఎమ్మెల్యేల మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది.

* రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల చేపట్టిన వివిధ చర్యలను తక్షణమే అమలు చేయాల్సిందిగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ సూచించారు. బ్యాలెన్స్‌ షీట్లను పటిష్ఠం చేసుకోవడంపై దృష్టి సారించడాన్ని కొనసాగించాలని పీఎస్‌బీల మేనేజింగ్‌ డైరెక్టర్లు, ముఖ్య కార్యనిర్వహణ అధికారులతో జరిపిన సమావేశంలో ఆయన తెలిపారు. కరోనా మహమ్మారి సృష్టించిన అవరోధాలను ఎదుర్కొంటూనే ప్రజలకు, వ్యాపార సంస్థలకు రుణ సదుపాయాన్ని అందించడం సహా వివిధ బ్యాంకింగ్‌ సేవలను అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులది కీలక పాత్ర అని అన్నారు. కొవిడ్‌-19 రెండో దశ నేపథ్యంలో అత్యవసర వైద్య సేవలకు రూ.50,000 కోట్ల వరకు తక్షణ నిధుల లభ్యత, ఎంఎస్‌ఎమ్‌ఈలకు రుణాల మంజూరును పెంచడం, రుణాల పునర్‌వ్యవస్థీకరణ, కేవైసీ నిబంధనల సులభతరం లాంటి పలు చర్యలను ఈ నెల ప్రారంభంలో ఆర్‌బీఐ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆర్థిక రంగం స్థితిగతులు, చిన్న రుణ గ్రహీతలు, ఎంఎస్‌ఎమ్‌ఈలు సహా వివిధ రంగాలకు రుణాల మంజూరుపై చర్చించారు

* పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. దీనికి తోడు వంట గ్యాస్‌ ధర కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 61 రూపాలయలకే గ్యాస్‌ సిలిండర్‌ లభిస్తే.. ఏంటి జోక్‌ అనుకుంటున్నారా. కాదు వాస్తవమే. 861 రూపాయల విలువ చేసే గ్యాస్‌ సిలిండర్‌ కేవలం 61 రూపాలకే లభించనుంది. గ్యాస్ సిలిండర్‌పై ఆఫర్ పొందటానికి మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లో నుంచే ఆఫర్ పొందొచ్చు. ఈవాలెట్ సంస్థ పేటీఎం కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. తన ప్లాట్‌ఫామ్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది.

* చైనీస్‌ ప్రముఖ సోషల్‌ మీడియా యాప్‌ టిక్‌టాక్‌ మాతృ సంస్థ బైట్‌డాన్స్‌ సహ వ్యవస్థాపకుడు జాంగ్‌ యిమింగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను సంస్థకు సీఈఓగా ఉండబోనని గురువారం వెల్లడించారు. కంపెనీ మరో కో- ఫౌండర్‌ రూబో లియాంగ్‌ తన స్థానంలో బాధ్యతలు చేపడతారని, అధికార మార్పిడి సాఫీగా సాగేందుకు ఆరు నెలల పాటు రూబోతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఈ మేరకు.. ‘‘ఆదర్శవంతమైన మేనేజర్‌గా ఉండే నైపుణ్యాలు నాలో కొరవడ్డాయి అన్నది నిజం. నాకైతే మార్కెట్‌ విధానాల మీద, ఆర్గనైజేషనల్‌ ఎనాలసిస్‌ మీద ఆసక్తి.