Movies

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులకు శ్రీకారం

చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులకు శ్రీకారం

కరోనా మహమ్మారి నేపద్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆక్సిజన్‌ సరఫరా చేసేందుకు నటుడు, కేంద్రమాజీమంత్రి చిరంజీవి నడుం బిగించారు. ఉభయ రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలో చిరంజీవి ఆక్సిజన్‌ బ్యాంకులు ఏర్పాటు చేయాలని చిరంజీవి నిర్ణయించారు. ఆక్సిజన్‌ అందక ఎవరూ మరణించకూడదనే ఉద్దేశంతో రావున్న వారం రోజుల్లోనే ప్రజలకు ఆక్సిజన్‌ బ్యాంకులు అందుబాటులోకి వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు.