Fashion

విచ్ఛిన్నమవుతున్న హిందూ కుటుంబ వ్యవస్థ. కారణాలు ఇవి.

విచ్ఛిన్నమవుతున్న హిందూ కుటుంబ వ్యవస్థ. కారణాలు ఇవి.

ఇక యువతీ యువకులకు అనేక పోర్న్ సైట్స్… విశృంఖల సినిమాలు… అందు బాటులోకి వచ్చాయి. ఈ దుష్పరిణామాల ప్రభావం… కుటుంబాలపై పడింది.
(దీని ఫలితాలు మరో పదేళ్లు పోతేగాని మనకు అర్థం కావు.)
అందుకే,
మనం సంప్రదాయాలు, శాస్త్రాలు, గురువులు, ఇతిహాసాలు ,ఆచారాలు ,కట్టుబాట్లు, నమ్మకాలు రోజురోజుకు డొల్లతనంగా కనిపిస్తుంది. కనుకనే, హిందూ కుటుంబంలో శాంతి లేదు..

ప్రతివారూ ఆస్తులు, సంపాదన, కెరీరిజం పేరుతో.. తమ సంతానాన్ని యంత్రాల్లా తయారు చేస్తున్నారు.

“తక్కువ సంతానం – ఎక్కువ సంపాదన”,
ఇప్పుడు హిందూ జాతికి ప్రమాదంగా మారింది.
ఉన్న ఇద్దరినీ విదేశాలకు పంపడం.. ఒక వర్గం చేస్తే…
వారిని అనుకరిస్తూ,
డబ్బు లేని వారు కూడా, లక్షలు లక్షలు పెట్టి చదివించాలనే తాపత్రయం, వాళ్ళ కుటుంబ వ్యవస్థను ఆర్థికంగా ధ్వంసం చేస్తున్నది.
ఈ క్రమంలో వారి యువతలో అధికభాగం, అజ్ఞానంతో,
విపరీతమైన వృధా ఖర్చు చేస్తూ,
తాగుబోతులుగా మారిపోతున్నారు.
హైదరాబాదులో అధిక సంపాదనకల్ల software ఉద్యోగులు, ఎక్కువమంది విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయంపై tv లో కూడా live చర్చ జరిగింది
ఫలితంగా వారి
కుటుంబాలు ధ్వంసమై పోతున్నాయి.

అసలు కథ ఇక్కడే మొదలవుతుంది…
డ్రైవర్లుగా ,పనివాళ్లుగా ,వంటవాళ్ళుగా ,అటెండర్లుగా…
ధనికుల ఇళ్ళల్లో పని చేయడానికి ఒక వర్గం ప్రజలు చేరుతున్నారు.
తదనంతర కాలంలో ఏం జరుగుతుందో మన కళ్ళతో చూస్తున్నాం.

ఇక మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థ ఉన్న వాళ్ల ఆడపిల్లల్ని కళాశాలల్లో..పాఠశాలల్లో ట్రాప్ చేసి, మతం మార్చి, పెళ్లి చేసుకుంటున్నారు.
వీళ్ళు కష్టపడి, సంపాదించుకున్న సంపదంతా,
ఒక్క క్షణంలో వాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

ఇక అవసరంలేని ఆర్భాటాలతో, రకరకాల కార్యక్రమాలు చేసి, అప్పులపాలవుతున్నారు ఇంకొందరు.

అలాగే
ఏ రాజకీయ వ్యవస్థ దేశానికి మేలు చేస్తుందో ఆలోచించే సాధారణ పరిజ్ఞానం కూడా,
మన కుటుంబాల్లో ఉండడం లేదు.

ఇక ఆధ్యాత్మిక రంగం పుచ్చి పోయింది.
పూర్వం ప్రతి కుటుంబానికి కుల గురువు ఉండేవాడు. లేదా పురోహితులు ఉండేవాడు. వాళ్లతో చర్చించి, ఎంత అవసరమో అంతే స్థాయిలో ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ, ధర్మబద్ధంగా శాంతిగా ప్రజలు జీవించారు.
ఇప్పుడు
1 స్వామీజీ లంతా ఎవరి దారి వారిదే..
2 టీవీ ల్లో దర్శనంఇచ్చే మహా మహా పండితులు, అనేక రకాలవివాదాస్పద విషయాలు,
ప్రజలకు బోధించి, సరైన జ్ఞానం ఇవ్వకుండా..
భ్రష్టులను తయారు చేస్తున్నారు.
3.ఇక ఉపాసకుల పేరుతో, జ్యోతిష్యుల పేరుతో మరికొందరు ఇంకో దారిలో ఉన్నారు.

మరోవైపు మన హిందువులు పన్నులు చెల్లిస్తూ, నడిపిస్తూ ఉన్న వ్యవస్థల్ని, ఒక వర్గం ప్రజలు హాయిగా అనుభవిస్తున్నారు.

రాజకీయ అవ్యవస్థలన్నీ మనకు తెలియనివి కావు. లౌకికవాదం అనే ముసుగు తొడుక్కుని, వారి ప్రయోజనాలు వారు నెరవేర్చుకుంటున్నారు.

దురాశ, అజ్ఞానం, తెలియని తనం,
సోమరితనం వీటన్నింటి కారణంగా,
సగటు హిందువు,
తన కుటుంబంలో
సరైన పాత్ర పోషించే లేకపోతున్నాడు.

మనకు తెలియకుండా
మన హిందూ కుటుంబాల్లో ప్రవేశిస్తున్న పాశ్చాత్యీకరణ.. కుటుంబాల్లోని పిల్లల భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నది.

మరోవైపు చదువుకున్న వాళ్ళు..
వైట్ కాలర్ మనస్తత్వంతో
సంపాదన ప్రెస్టేజ్ గా భావించి,
జీవితమంతా అదే maniaలో బతికేస్తున్నారు.

ఉమ్మడి కుటుంబ జీవన.. సంబంధబాంధవ్యాలు..
కౌన్సిలింగ్ లేకపోవడం వల్ల,
ఎన్నో కుటుంబాలు పెళ్లి తర్వాత,
విడాకుల వైపు మళ్లుతున్నాయి.

అందుకే ఇటీవల కాలంలో కేంద్రం త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చినప్పుడు, ఓవైసీ గణాంకాలు చెప్తూ, “హిందూ కుటుంబాల్లో ఉన్నంత విడాకుల రేటు, ముస్లిం కుటుంబాల్లో లేదు” అన్నాడు.

ఈ విచ్ఛిన్నం కావడానికి కారణాలను
మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది.
హిందూ కుటుంబాల్లో అశాంతికి కారణం
మనం వెంటనే కనిపెట్టాలి.

మనకు
1.హిందూ దేవాలయాల్లో కౌన్సెలింగ్ లేదు..
2 టీవీలో సీరియల్ తప్ప, ఇంకేమీ లేవు.
3 సినిమాల్లో.. క్రైం..ద్రోహం.. అత్యాచారం..హింస.. శరీరక ప్రేమ.. ఇవే ప్రధాన విశేషాలు.
ఇలాంటి అద్భుతాలు చెప్పే సినిమానటులు, ఇవాళ మనకు సెలబ్రిటీలు, ఆరాధ్యులు.
ఒక
స్వామీజీని, సినిమా నటిని,
ఒకచోట కూర్చోబెట్టి, ఓటింగ్ జరిగితే….
ఓట్లన్నీ ఆమెకే పడుతాయి.

మనకు మంచి చెడ్డ నేర్పించాల్సిన మీడియా,
రాజకీయ అంశాలను, వివాదాస్పద అంశాలను,
తన వ్యక్తిగత స్వార్థంతో, వండి ఓర్చి,
మనకదించి,
ఏది న్యాయం ఏది అన్యాయమో?
తెలియకుండా చేస్తున్నది.

మన కుటుంబాల్లో, ఇలాంటి కౌన్సిలింగ్ లేని కారణంగా,
విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నాం అనేవాళ్ళు,
“హిందూ మత ఆఛార, సంప్రదాయాలను, తిరస్కరించాలి” అనే భావాన్ని సులభంగా తలపై మోస్తున్నారు.

మనం చెప్పే సద్గుణ సంపదంతా,
ఈ దుష్ట శక్తులు,
తమ అందమైన ముఖాలతో,
తమ అబద్దపు వాదనలతో,
ఒక్క క్షణంలో ధ్వంసం చేస్తున్నారు.

సోషల్ మీడియా ఒక విప్లవం అని మనం అనుకుంటున్నాం…
దానితో పాటుగా,
మోయలేనంత విజ్ఞానం అజ్ఞానంతో కలిసి,
మన మెదళ్ళలోకి ఎక్కుతుంది.