Health

ఆనందయ్య మందుకు వారం రోజుల బ్రేక్-TNI బులెటిన్

ఆనందయ్య మందుకు వారం రోజుల బ్రేక్-TNI బులెటిన్

* దేశంలో కరోనా మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు.శుక్రవారం సైతం నాలుగు వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి.కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 24 గంటల వ్యవధిలో 4,194మంది ప్రాణాలు కోల్పోయారు.అటు వైరస్ విజృంభణ సైతం కొనసాగుతోంది. మరో 2,57,299 లక్షల మందికి కొవిడ్ సోకినట్లు తేలింది.వైరస్ బారిన పడ్డవారిలో 3,57,630మంది తాజాగా కోలుకున్నారు.మొత్తం కేసులు: 2,62,89,290.మరణాలు: 2,95,525.మొత్తం రికవరీలు: 2,30,70,365.యాక్టివ్ కేసులు: 29,23,400.

* పి గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు కు రెండవ సారి కరోనా పాజిటివ్..

* కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుకు బ్రేక్. ఆనందయ్య కరోనా మందు వారం, పది రోజుల పాటు నిలిపివేత.

* తమిళనాడులో ఇప్పటికీ కొవిడ్ వ్యాప్తి అదుపులోకి రాని నేపథ్యంలో స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. మే 24 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించడం తెలిసిందే. మరో రెండ్రోజుల్లో ఆ లాక్ డౌన్ ముగియనుండడంతో సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులపై చర్చించారు. వైద్య, ఆరోగ్య నిపుణులు రెండు వారాలు కఠిన లాక్ డౌన్ విధించాలని సూచించారు.

* కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే.. మరోవైపు బ్లాక్​ ఫంగస్​ భయపెడుతోంది. దీనిపై వెంటనే దృష్టి సారించి రోగులకు అత్యవసర చికిత్స అందజేయాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్లాక్​ ఫంగస్​ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.

* ఆంధప్రదేశ్‌లో కరోనా కేసులు 20వేలకు దిగువగా నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 90,609 పరీక్షలు నిర్వహించగా 19,981 పాజిటివ్‌ కేసులు.. 118 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,62,060కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 10,022 మంది మృతి చెందారు. కరోనా నుంచి 13,41,355 మంది కోలుకోగా.. రాష్ట్రవ్యాప్తంగా 2,10,683 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,85,25,758 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

* లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి ఎంతోమందికి సాయం చేస్తున్న నటుడు సోనూసూద్​.. తన ఆధ్వర్యంలోని తొలి సెట్​ ఆక్సిజన్​ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటు చేయనున్నారు.