Health

ఇండియాలో మొదలైన రష్యన్ వ్యాక్సిన్ ఉత్పత్తి-TNI బులెటిన్

ఇండియాలో మొదలైన రష్యన్ వ్యాక్సిన్ ఉత్పత్తి-TNI బులెటిన్ - India Begins Manufacturing Sputnik Vaccine By Russia

* రాష్ట్రంలో పోలీసులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. బైక్‌లు, ఆటోలను పాస్ లేకుండా వస్తే అనుమతిని నిరాకరిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి తెలంగాణలోకి ఈపాస్ లేకుండా వచ్చిన వారికి వెనక్కి పంపిస్తున్నారు. మరోసారి వస్తే.. వాహనం సీజ్ చేస్తామని హెచ్చ‌రిస్తున్నారు.

* గ్రామం బాగుండాలి.. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు సర్పంచ్‌ పర్వతగిరి రాజు కోవిడ్‌ బాధితుల కోసం సొంతంగా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాడు. గ్రామంలో యాక్టివ్‌ కేసులను తగ్గించడానికి ఇదే సరైన మార్గమని భావించిన ఆయన.. స్థానిక సెయింట్‌ థెరిస్సా స్కూల్‌లో ఐసోలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేశాడు. ఆదివారం రాత్రి నుంచి ఈ కేంద్రంలో పూర్తి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ ఉండే వారికి ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్నం చికెన్‌తో, రాత్రికి శాఖాహారంతో భోజనం అందించనున్నారు. కాగా, కోవిడ్‌ వచ్చినవారి ఇళ్లలో ఐసోలేషన్‌ సదుపాయం లేక ఇబ్బందిపడుతున్నారని సర్పంచ్‌  రాజు తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. 24 గంటల వ్యవధిలో 58,835 నమూనాలను పరీక్షించగా 12,994 పాజిటివ్‌ కేసులు.. 96 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 15,93,921కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 10,222 మంది మృతి చెందారు. కరోనా నుంచి 13,79,837 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,03,821 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,86,76,222 నమూనాలను పరీక్షించినట్లు వైద్యశాఖ పేర్కొంది.

* రష్యాకు చెందిన స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి భారత్ లో ప్రారంభమైంది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్లను రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్), పనేసియా బయోటెక్ భారత్ లో ఉత్పత్తి చేస్తున్నాయి. ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్ వి డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించకున్నారు. కాగా, భారత గడ్డపై తయారైన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ టీకాలను రష్యాలోని గమలేయా ఇన్ స్టిట్యూట్ కు పంపనున్నారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది గమలేయా సంస్థ అని తెలిసిందే. భారత్ లో తయారైన వ్యాక్సిన్ల నాణ్యతను గమలేయా ఇన్ స్టిట్యూట్ పరీక్షించనుందని ఆర్డీఐఎఫ్ వెల్లడించింది.

* కరోనాతో మరణించిన జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే 5 లక్షలు విడుదల చేయాలి