Devotional

కన్నులపండువగా చిన్నతిరుమల కళ్యాణోత్సవం

కన్నులపండువగా చిన్నతిరుమల కళ్యాణోత్సవం

పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు ద్వారాకాతిరుమల .చిన్న తిరుపతి లో శ్రీవెంకటేశ్వర స్వామి.పద్మావతి అమ్మ వారి కళ్యాణ మహోత్సవం బుధవారం కన్నుల పండుగగా జరిగింది.స్వామివారి స్వార్జిత కళ్యాణ మండపం లో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పెద్దలు గాను .బంధువులు గాను వైదికులు హాజరయ్యారు.పురాతన ఆచారాలు.సనాతన ధర్మాల ప్రకారం స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు కట్టి.శాస్త్రోక్తం గా ఆలయ పండితులు.ఈ ఓ జి వి సుబ్బారెడ్డి దంపతుల సమక్షం లో ఆలయ ఆస్థాన పురోహితులు మంత్రోచ్ఛారణలు చదువు తుండగా భజంత్రీలు మోగించే సన్నాయి మేళతాళాలు మధ్య స్వామివారికి అమ్మవారికి కళ్యాణం ఘనంగా జరిపించారు.ఈ అద్భుతమైన వివాహ మహోత్సవాన్ని కోవిడ్ కారణం గా భక్తులు ఆన్ లైన్ లో ను యూ ట్యూబ్ లోను వీక్షిస్తూ స్వామివారికి అమ్మవారికి ఆన్ లైన్ లొనే అక్షింతలు వేసి ఆనంద పరవాసులయ్యారని ఈ ఓ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు