Business

ఇక టోల్ కట్టక్కర్లేదు-వాణిజ్యం

Business News - No More Toll Pay If After Yellow Line

* కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్ చార్జీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు సజావుగా ప్రయాణించేలా టోల్ ప్లాజా దగ్గర రద్దీ సమయంలో కూడా వాహనదారులకు 10 సెకన్ల కంటే ఎక్కువ సమయం పట్టకుండా ఉండేలా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. టోల్ ప్లాజాల నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న పసుపు గీత దాటి వాహనాలు వేచి ఉంటే అప్పుడు ఆ గీత ముందున్న వాహనాలు టోల్ చార్జీలు చెల్లించకుండానే వెళ్లిపోవచ్చు.

* మళ్లి పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు. రోజు విడిచి రోజు ధర పెంచుతున్న ఆయిల్ కంపెనీలు..ఇవ్వాళ లీటర్ పెట్రోల్ 23 పైసలు, డీజిల్ పై 25 పైసలు పెంచిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు..హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.36. డీజిల్ ధర రూ. 92.24, గత 24 రోజుల్లో 14 సార్లు రేటు పెంచిన కంపెనీలు.. గత 24 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ.3.28, డీజిల్ పై రూ.3.88 పెంచిన కంపెనీలు. దాదాపు అన్ని మెట్రలో సిటీల్లో వందకు చేరువలో పెట్రోల డీజిల్ ధరలు

* ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం వేల సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య కూడా రోజూ 100కు అటూఇటూగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాతో బాధపడేవారికి ప్రత్యేకంగా చికిత్స అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యంగా వైద్య సదుపాయాలు తక్కువగా ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ స్లీపర్‌ బస్సుల్లో కొవిడ్‌ రోగులకు చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.

* కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన నూతన డిజిటల్‌ (ఐటీ) నిబంధనలపై ట్విటర్‌ స్పందించింది. కొత్త ఐటీ నిబంధనల అమలుకు 3 నెలలు గడువును ట్విటర్‌ కోరింది. కేంద్రంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. కొత్త ఐటీ నిబంధనలపై సోషల్‌ మీడియా సంస్థలకు ప్రతిబంధకంగా మారాయి. ఈ క్రమంలో కేంద్రం, వాట్సప్‌ మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.