Politics

ఓటుకు నోటు కేసులో రేవంత్‌పై ఈడీ ఛార్జిషీట్-నేరవార్తలు

News Roundup - ED Files Chargesheet Against Revanth Reddy

* ఓటుకు నోటు కేసు: రేవంత్ రెడ్డిపై చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ.చంద్రబాబు పాత్రనూ ప్రస్తావించిన ఈడి.కొన్నేళ్ల కిందట సంచలనంగ సృష్టించిన ఓటుకు నోటు కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది.అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు.కాగా, ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపడం తెలిసిందే.నేడు దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ…చంద్రబాబు పాత్రను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా… టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి, తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం.

* గుంటూరు గ్రానైట్ క్వారీస్ ఫై విజిలెన్స్ దాడులు.యూనివర్సల్ స్టోన్స్ అండ్ ఎక్సపోర్ట్స్ , గౌరీ శంకర్ గ్రానైట్స్ ఫై ఏకకాలంలో సోదాలు.నిబంధనలను తుంగలో తొక్కి నడుపుతున్న గ్రానైట్స్ ఫై విజిలెన్స్ కొరడా.గతకొంతకాలం గా యూనివర్సల్ స్టోన్స్ అండ్ ఎక్సపోర్ట్స్, గౌరీ శంకర్ గ్రానైట్స్ ఫై ఫిర్యాదులు.కీలక పత్రాలు స్వాధీనం.

* కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌లోనూ బెంగళూరు ప్రజలు మామూలుగానే సంచరిస్తున్నారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు కఠిన చర్యలకు దిగారు. రోజూ ఉదయం 10 గంటల అనంతరం నగర ప్రముఖ రోడ్లలో బ్యారికేడ్లు అమర్చి తనిఖీ చేయడం, అకారణంగా బయటకు వచ్చారని తేలితే వాహనం సీజ్‌ చేసి జరిమానా, కేసు నమోదు చేస్తున్నారు.  ఈ క్రమంలో పలు చోట్ల లాక్‌డౌన్‌ ఉల్లంఘనులకు బస్కీలు, గుంజీలు తీయడం, లాఠీలతో పోలీసులు పాఠం చెబుతుంటే కొన్నిచోట్ల మర్యాదగా బైక్‌ సీజ్‌ చేయడం జరుగుతోంది. బెంగళూరు పీణ్యా పోలీసులు బయట తిరిగేవారికి గులాబీ పువ్వు అందించి బైక్‌ స్వాధీనం చేసుకుంటున్నారు. 

* విశాఖ సింహాచలం, ఆర్.ఆర్.వెంకటాపురం సబ్ స్టేషన్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.గురువారం తెల్లవారు జామున 3:30 గంటలకి సబ్ స్టేషన్ లో ట్రాన్సఫార్మర్లు ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మూడు ఫైర్ ఇంజన్ ల సహకారంతో మంటలను అదుపు చేసినట్లు డిస్ట్రిక్ట్ ఫైర్ అసిస్టెంట్ ఆఫీసర్ గోపికృష్ణ తెలిపారు.