WorldWonders

₹75కోట్లు దానం చేసిన కరోనా బాధితుడు-TNI బులెటిన్

TNI COVID Bulletin - Gujarati COVID Recovered Old Man Donates 75Crores

* గుజరాత్ లోని ఓ గ్రామంలో ఉన్న ఓ ధనికుడు హాస్పిటల్లో చికిత్స పొంది కరోనాను జయించి వచ్చిన తరువాత ఆ గ్రామంలో ఉన్న మహిళలకు చిన్నారులతో సహా అందరికీ ఒక లక్ష నుండి 25 లక్షల వరకూ మొత్తం 75 కోట్ల నగదును దానంగా పంచి అభినవ దాన కర్ణుడు అనిపించుకున్నాడు.

* కరోనా విపత్కర పరిస్థితుల్లో సమ్మెకు పిలుపునివ్వడం మంచిది కాదని, ఇటువంటి కీలక సమయంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని తక్షణమే విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జూనియర్ డాక్టర్లకు సూచించారు.

* ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ. ఆనందయ్య మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదన్న ప్రభుత్వం. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం. ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయన్న ప్రభుత్వం. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలన్న హైకోర్టు.

* కరోనా కోసం ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తున్నారో ఆ వివరాలు వెల్లడించారు. అయితే ఏమేమి వనమూలికలు కలిపితే ఆ మందు తయారైందీ కూడా చెప్పారు కానీ.. ఏదీ ఎంత మోతాదులో కలుపుతున్నారో అన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.డాక్టర్ రాజ్ కుమార్ బత్తిన (ఆయుర్వేద సైంటిస్టు) ఈ మందు మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చని చెప్పారు.పసుపు 10 గ్రాములు, నల్లజీలకర్ర 20 గ్రాములు, జాజికాయ 20 గ్రాములు, తోక మిరియాలు 50 గ్రాములు, పిప్పిలి 20 గ్రాములు, దాల్చిన చెక్క 30 గ్రాములు, అల్లం, శోంఠి 50 గ్రాములు, తాటి బెల్లం 100 గ్రాములు, తిప్పతీగ ఆకు 4 గ్రాములు, కుప్పిటాకు 20 గ్రాములు, నేల ఉసిరి ఆకు 10 గ్రాములు.. ఇలాంటి వనమూలికలతో ఇంట్లోనే స్వయంగా మందు తయారు చేసుకోవచ్చునని రాజ్ కుమార్ తెలిపారు. ఇంట్లో ఎవరికైనా కరోనా పాజిటీవ్ వచ్చినా, ఇమ్యూనిటీ పవర్ లేకపోయినా ఈ మందు వాడవచ్చునన్నారు