Politics

నకిలీరత్నాలు అంటున్న చంద్రబాబు

నకిలీరత్నాలు అంటున్న చంద్రబాబు

నందమూరి తారక రామారావు యుగ పురుషుడు. ఆయన జీవితం ప్రస్తుత తరాలతో పాటు భావితరాలకూ దిక్సూచి. సినీ, రాజకీయ రంగాల్లో రాణించి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. నాటి రూ.2కే కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారింది. పేద పిల్లలు గురుకులాల్లో చదవాలనే సదాశయంతో పాఠశాలలు నెలకొల్పారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో అంకెల గారడీ చేస్తోందని.. గోరంత చేసి, కొండంత దోచుకుంటూ ప్రజల్ని మోసగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దీనిపై తమతో చర్చకు రావాలని సవాల్‌ చేశారు. ప్రభుత్వానిది మోసకారి సంక్షేమం, అమలు చేస్తోంది నకిలీ రత్నాలని నిరూపిస్తామన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం ఏ వర్గానికి ఏం చేసిందో గ్రామసభల్లో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైకాపా గంపగుత్తగా అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. విభజనచట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా సహా అప్పటి ప్రధాని ఇచ్చిన హామీల్లో ఈ రెండేళ్లలో ఎన్ని సాధించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రత్యేక హోదా సాధించలేకపోతే ముఖ్యమంత్రి, వైకాపా ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబు శుక్రవారం తెదేపా మహానాడులో వివిధ తీర్మానాలపై మాట్లాడటంతో పాటు ముగింపు ఉపన్యాసం చేశారు.