NRI-NRT

అంతర్జాతీయ విమానాలపై నిషేధం-తాజావార్తలు

అంతర్జాతీయ విమానాలపై నిషేధం-తాజావార్తలు

* రేపటి నుండి మూడు రోజుల పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్

* అంత‌ర్జాతీయ కమర్షియల్ ప్యాసింజర్ విమానాలపై నిషేధం జూన్ 30 వరకు పొడిగింపు…! అంతర్జాతీయ విమానాల‌పై నిషేధాన్ని కేంద్రం మ‌రో 30 రోజులు పొడిగించింది. అంత‌ర్జాతీయ‌ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మ‌రో నెల‌పాటు పొడిగిస్తున్న‌ట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్ల‌డించింది. జూన్ 30వ తేదీ వరకు ఈ నిషేధం అమ‌ల్లో ఉంటుంద‌ని డీజీసీఏ శుక్రవారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. అయితే, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లు, విమానాలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. కొవిడ్ కారణంగా గత ఏడాది జూన్ 30 నుంచి అన్ని అంతర్జాతీయ క‌మ‌ర్షియ‌ల్‌, ప్యాసింజర్ విమానాలపై నిషేధం అమల్లో ఉన్న‌ది. అయినప్పటికీ ప్యాసింజర్ల రాకపోకలకు అవరోధం లేకుండా పలు దేశాలతో ఇండియా చేసుకున్న ద్వైపాక్షిక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం పలు అంతర్జాతీయ విమానాల ఆపరేషన్ జరుగుతున్న‌ది. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్ సహా 27 దేశాలతో భార‌త్‌ ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకున్న‌ది.

* యాస్​ తుఫాన్ ప్రభావంపై సమీక్షించేందుకు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్​లో పర్యటించారు. ఈ సందర్భంగా యాస్​ తుపాను ప్రభావంపై మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే పశ్చిమ మెదినీపుర్​ జిల్లా కలైకుండాలో నిర్వహించిన ఈ రివ్యూ మీటింగ్ కి ముందు హైడ్రామా నెలకొంది. సమావేశానికి..ముందుగా నిర్ణయించిన సమయానికి రాకుండా మోడీ,గవర్నర్ ని వెయిట్​ చేయించారు సీఎం మమతా బెనర్జీ. సీఎం మమతా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుమారు 30 నిమిషాలు ఆలస్యంగా రివ్యూ మీటింగ్ కి వచ్చినట్లు సమాచారం. ఆలస్యంగా వచ్చిన తర్వాత కూడా.. ఎక్కువ సేపు మమత సమావేశంలో ఉండలేదు. కేవలం 15నిమిషాలు మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు దీదీ. తుఫాన్ వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక నివేదికను ప్రధాని అందించి..తనకు వేరే మీటింగ్ లు ఉన్నాయంటూ వెంటనే రివ్యూ మీటింగ్ నుంచి మమత వెళ్లిపోయారు.

* కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్‌ తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. వైరస్‌ను కట్టడి చేశామని ఆనందించేలోపే మళ్లీ కొత్త కేసులు నమోదవుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్‌ నగరంలో 20 కొత్త కేసులు బయటపడటం అధికారుల్లో ఆందోళన రేకిత్తిస్తోంది. అప్రమత్తమైన ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. తదుపరి ఆదేశాల వరకు అందరూ ఇళ్లల్లోనే ఉండాలని ఆదేశించింది.

* కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి మూడు ఫంగస్‌లు సోకి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక సంజయ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల కున్వర్‌ సింగ్‌ అనే లాయర్‌ కరోనా బారిన పడటంతో చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రిలో చేరారు. మే 24న ఆయనకు ఎండోస్కోపీ చేయగా.. బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌ను కూడా గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. శరీరంలోని రక్తం విషపూరితంగా మారడంతో చికిత్స పొందుతూ నిన్న రాత్రి కున్వార్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయినట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

* కరోనాకు మందును పంపిణీ చేసిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తుతో ఆయన్ను తరలించారు. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ నెల 21నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

* కరోనాకు మందును పంపిణీ చేసిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తుతో ఆయన్ను తరలించారు. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ నెల 21నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

* క‌రోనా బారిన ప‌డి మృతిచెందిన వారిని కొన్ని చోట్ల‌ రోడ్ల ప‌క్క‌న వదిలేయ‌డంపై క‌ల‌త చెందామ‌ని తెదేపా అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో అనాథ శ‌వాల‌కు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తామ‌ని ఆమె ప్ర‌కటించారు. కరోనా మృతుల కుటుంబీకులు ముందుకు రాక‌పోతే అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేస్తామ‌ని చెప్పారు. ఇందుకోసం ప్ర‌త్యేక వాహ‌నాల‌ను సిద్ధం చేసిన‌ట్లు వివ‌రించారు. ఏపీలో ఎన్టీఆర్ ట్ర‌స్టు త‌ర‌ఫున‌ 4 ఆక్సిజ‌న్ ప్లాంట్ల నిర్మాణం చురుగ్గా సాగుతోంద‌ని తెలిపారు.

* క‌రోనా ప‌రీక్ష చేయ‌కుండానే ఓ వ్య‌క్తికి కొవిడ్‌ పాజిటివ్ నిర్ధ‌ర‌ణ అయిన‌ట్లు రాసిన‌ వికారాబాద్ జిల్లా పరిగి ప్ర‌భుత్వాసుత్రి సిబ్బంది నిర్ల‌క్ష్య‌ వైఖ‌రి చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. చంద్ర‌య్య అనే వ్య‌క్తి బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాల‌తో ప‌రిగి ఆస్ప‌త్రిలో చేరారు. బాధితుడికి ప‌రీక్ష చేయకుండానే క‌రోనా పాజిటివ్‌గా నిర్ధ‌రించిన వైద్యులు హైద‌రాబాద్ కింగ్‌కోఠి ఆస్ప‌త్రికి రిఫ‌ర్ చేశారు. కొవిడ్ ఉండ‌టంతో కింగ్‌కోఠి ఆస్ప‌త్రి వైద్యులు చంద్ర‌య్య‌ను చేర్చుకోడానికి నిరాక‌రించారు.

* నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య త‌యారు చేసిన‌ ఔష‌ధంపై ఆయుష్ ఇంకా తుది నివేదిక ఇవ్వ‌లేద‌ని మంత్రి మేక‌పాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. ఆ నివేదిక వ‌చ్చే వ‌ర‌కూ ప్ర‌భుత్వం మందుపై తుది నిర్ణ‌యం తీసుకోద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆయుష్ నుంచి నివేదిక వ‌చ్చిన త‌ర్వాత కొవిడ్ ప‌రిస్థితుల‌కు ఆధారంగా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మంత్రి వివ‌రించారు. మ‌రో వైపు ఈ తెల్ల‌వారుజామున పోలీసులు ఆనంద‌య్య‌ను ఓ ర‌హ‌స్య ప్ర‌దేశానికి త‌ర‌లించారు.

* ప్ర‌జ‌ల స‌హ‌కారంతో లాక్‌డౌన్ ప‌క‌డ్బందీగా అమ‌ల‌వుతోంద‌ని హైద‌రాబాద్ సీపీ అంజ‌నీకుమార్ అన్నారు. పాత‌బ‌స్తీలో లాక్‌డౌన్ అమలును సీపీతో పాటు పోలీసు అద‌న‌పు క‌మిష‌నర్ చౌహాన్ పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా అంజ‌నీ కుమార్ మాట్లాడుతూ.. 99 శాతం మంది ప్ర‌జ‌లు పోలీసుల‌కు స‌హ‌కరిస్తున్నార‌న్నారు. కేవలం ఒక్క శాతం మంది ప్ర‌జ‌లే అన‌వ‌స‌రంగా బ‌య‌టికి వ‌స్తున్నార‌ని.. వారిని గుర్తించి కేసులు న‌మోదు చేస్తున్న‌ట్లు వివ‌రించారు. గ‌డిచిన 17 రోజులుగా లాక్‌డౌన్ ప‌టిష్ఠంగా అమలవుతోంద‌న్నారు.

* గుంటూరులో కరోనా రోగులకు యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఇంజెక్షన్‌ను ప్రయోగించారు. ప్రముఖ వైరాలజిస్ట్ కల్యాణ చక్రవర్తి పర్యవేక్షణలో ఈ ఇంజెక్షన్‌ను ఇద్దరు రోగులకు ఇచ్చారు. శ్రీ హాస్పిటల్‌ కరోనా చికిత్సలో రీజెనరాన్‌ ఇంజెక్షన్‌ను వైద్యులు వినియోగించారు. రీజెనరాన్‌ వినియోగంతో 24గంటల్లో మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి తెలిపారు. బాధితులను త్వరలోనే ఇంటికి పంపుతామని చెప్పారు. కరోనా వచ్చాక వీలైనంత త్వరగా ఔషధం వాడితే మంచి ఫలితాలు ఉంటాయని తెలిపారు.

* కేంద్ర ప్ర‌భుత్వం పేద ప్ర‌జ‌ల‌కు అంద‌జేస్తున్న‌ ఐదు కిలోల ఉచిత బియ్యం కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ‌లో అమ‌లు చేయాల‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. దేశంలోని 80 కోట్ల మందికి మేలు చేసేలా కేంద్రం తీసుకొచ్చిన‌ గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న కార్య‌క్ర‌మం కింద ఉచిత ఆహార ధాన్యాలు పంపీణీ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌త సంవ‌త్స‌రం అర్హులైన ల‌బ్ధిదారులంద‌రికీ ఐదు కిలోల చొప్పున ధాన్యాన్ని ఉచితంగా ఇచ్చిన‌ట్లు కిష‌న్‌రెడ్డి తెలిపారు.

* కొవిడ్-19 మహమ్మారి మూలాలను వెలికితీసే ప్రయత్నాలకు రాజకీయాలు ఆటంకం కలిగిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మిస్టరీని ఛేదించేందుకు శాస్త్రవేత్తల్ని తమపని తాము చేసుకోనివ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ‘సైన్స్‌ను రాజకీయాల నుంచి వేరుచేయమని మేం అడగాలనుకుంటున్నాం. సరైన దారిలో, సానుకూల వాతావరణంలో మనకు అవసరమైన సమాధానాలను కనుగొందాం. ఈ ప్రక్రియను రాజకీయాలు విషతుల్యం చేస్తున్నాయి’ అని ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరక్టర్ మైకేల్‌ ర్యాన్‌ హెచ్చరించారు.

* ప్రభుత్వ విప్‌, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న పది కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ కోసం విజయవాడలో ఏర్పాటైన రాష్ట్రస్థాయి ప్రత్యేక న్యాయస్థానంలో ఈ పది కేసుల విచారణ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఒకేసారి ఉపసంహరించుకుంటూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. ఈ ఏడాది మార్చి 23న డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు హోంశాఖ కేసుల ఎత్తివేత ఉత్తర్వులను జారీ చేసింది. ఇందుకు వీలుగా ఆయా న్యాయస్థానాల్లో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో పిటిషన్లు దాఖలు చేయించాలని డీజీపీని ఆదేశించింది. సీఎస్‌పీఏ ఆర్గనైజేషన్‌ పేరిట సర్వే నిర్వహిస్తున్న కొందరు సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని, వారిని అపహరించి నేరపూరితంగా బెదిరించారన్న ఫిర్యాదుపై జగ్గయ్యపేట పోలీసుస్టేషన్‌లో, జగ్గయ్యపేట ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఆక్రమణలు తొలగిస్తున్నప్పుడు ఆర్‌అండ్‌బీ ఏఈఈ విధులకు ఆటంకం కలిగించటం, నేరపూరిత బలప్రయోగం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులను ఎత్తివేశారు. వాటితోపాటు జగ్గయ్యపేట స్టేషన్‌లోని మరికొన్ని కేసులు, వత్సవాయి, నందిగామ, చిల్లకల్లు స్టేషన్లలో నమోదైన కేసులను తొలగించారు.