Business

సరికొత్త ₹100నోటు విడుదల చేయనున్న RBI

సరికొత్త ₹100నోటు విడుదల చేయనున్న RBI

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI అతిత్వరలోనే కొత్త రూ.100 కరెన్సీ నోట్లను తీసుకురాబోతోంది. ఇవి చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ నోట్లు సాధారణ నోట్ల మాదిరి ఉండవు. చూడటానికి ఒకేలా ఉన్నా కూడా ఇవి స్పెషల్ అని చెప్పాలి.

ఆర్‌బీఐ తీసుకురాబోతున్న కొత్త రూ.100 నోట్లకు వార్నిష్ పూత పూస్తారు. దీని వల్ల ఇవి ఎక్కువ కాలం మన్నికకు వస్తాయి. నీటికి తడవవు. అంత ఈజీగా చినిగిపోవు. దీంతో ఈ కొత్త రూ.100 నోట్లు ఎక్కువ కాలం మన్నికకు వస్తాయి. ఆర్‌బీఐ ఈ నోట్లను ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది.

ఆర్‌బీఐ త్వరలోనే ఈ కొత్త రూ.100 నోట్లను అందుబాటులోకి తీసుకురావొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్‌బీఐకి ఈ నోట్ల ముద్రనకు సంబంధించి అనుమతి ఇచ్చింది. ఇకపోతే కొత్తగా రాబోతున్న నోట్లు.. ప్రస్తుతం రూ.100 నోట్లు ఎలా ఉన్నాయో చూడటానికి అలానే ఉంటాయి.