Devotional

దుర్యోధనుడు స్వర్గానికి వెళ్లాడు

దుర్యోధనుడు స్వర్గానికి వెళ్లాడు

హిందూ తత్వశాస్త్రాలలో ఉన్న అత్యంత సాధారణ నమ్మకాల ప్రకారం, మానవుల చర్యలను రెండు రకాలుగా విభజించవచ్చు: మంచి మరియు చెడు కర్మలు (వీటిని పాప పుణ్యాలు అని కూడా వ్యవహరిస్తారు). మంచి కర్మ అనేది ఇతరుల ప్రయోజనాల కోసం, సదుద్దేశంతో చేసినదిగా ఉంటుంది. అయితే దీనికి పూర్తి వ్యతిరేకంగా, చెడు కర్మలు లేదా పాపములు అనేవి ఇతరులకు బాధ కలిగించేలా ఉంటాయి. మరియు ఒక శాశ్వతమైన ఉద్దేశ్యంతో చేయబడుతాయి. ఇక్కడ, కర్త కీలక పాత్రను పోషిస్తుందని ప్రస్తావించడం జరుగుతుంది; ఈ పాప పుణ్యముల ఆధారితంగానే, ప్రతిఫలం లిఖించబడి ఉంటుందని తెలుపబడింది.

క్రమంగా మరణానంతరం పాపం చేసిన వ్యకిని నరకానికి, మరియు పుణ్యాన్ని మూటకట్టుకున్న వ్యక్తిని స్వర్గానికి పంపడం జరుగుతుంటుంది. ఒక వ్యక్తి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాడు అని నిర్ణయించే దేవుడు, యమధర్మరాజు. అతనే మరణానికి ప్రభువు. మంచి, చెడు కర్మల మధ్య నిరంతరం యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడూనూ. ఏది గెలుస్తుందో ఎవరూ ఊహించలేరు కూడా. అటువంటి గొప్ప పోరాటములలో ఒకరి, మహాభారతములోని కౌరవ – పాండవ సంగ్రామం. అదే కురుక్షేత్రం. కానీ అంత పెద్ద సంగ్రామంలో ఓడిపోయినా కౌరవులలో ఒకరు మాత్రం స్వర్గానికి చేరారు. అతనే దుర్యోధనుడిగా పేరు కలిగిన సుయోధన సార్వభౌముడు.

దుర్యోధనుడు వాస్తవంగా తన మరణానంతరం స్వర్గ లోకానికి వెళ్ళినట్లు నమ్మబడుతుంది. పాండవులు నీతిమంతులనీ, కౌరవులు అధర్మబద్దులని చెప్పబడుతుంది కదా, అలాంటప్పుడుకౌరవులలో పెద్దవారైన దుర్యోధనుడు స్వర్గ లోకానికి వెళ్ళడానికి గల కారణమేమిటి? అంత బలమైన కారణం ఏదైనా ఉందా ? అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమ, ఉదారతలకు రాజు అతను.

దుర్యోధనుని రాక్షసునిగా చిత్రీకరించారు, కానీ తన రాజ్యం పట్ల ప్రేమ, ఉదారతలు కలిగిన గొప్ప నీతివంతమైన రాజు అన్నది వాస్తవం. చుట్టుపక్కల పరిస్థితులను తనకు అనువుగా మలచుకోవడమే కాకుండా,. ఒక విజయవంతమైన రాజుగా తన సామర్థ్యాలను, విజయాలను ప్రతిబింబింస్తూ రాజ్య పాలనలో నిష్ణాతునిగా ఉండేవాడు. పురాణాల ప్రకారం దుర్యోధనుడు యుద్ధం తరువాత మరణించబోతున్న సమయంలో శ్రీ కృష్ణుడు దుర్యోధనునికి దగ్గరలో కూర్చున్నాడు. అప్పుడు దుర్యోధనుడు, కృష్ణుడితో ” నేను ఎల్లప్పుడూ ఒక మంచి రాజుగానే ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నేను స్వర్గంలోనే స్థానం సంపాదించగలను, కానీ కృష్ణా, నీకు మాత్రం విచారం తప్పదు ” అని అన్నాడు. వెంటనే దుర్యోధనుడి మీద ఆకాశం నుండి పూల వర్షం కురిసింది, అతను చెప్పిన మాట నిజమని ఈ సంఘటనతో ఋజువైంది.

దయ, అర్థం చేసుకునే మనస్తత్వం, మంచి కోసం ఎంత పనైనా చేసే మొండితనం

కర్ణుడు దుర్యోధనునికి ప్రియమైన స్నేహితుడు. ఈ విధంగా దుర్యోధనుని భార్యకి కూడా కర్ణుడు మిత్రుడయ్యాడు. దుర్యోధనుడు లేనప్పుడు, కర్ణుడు దుర్యోధనుని భార్యతో పాచికలు ఆడుతున్నాడు. దుర్యోధనుని భార్య ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండగా, కర్ణుడు ద్వారానికి వ్యతిరేక దిశలో కూర్చుని ఉన్నారు. దుర్యోధనుని రాకను గమనించిన దుర్యోధనుని భార్య పైకి లేచి నిలబడింది. కానీ కర్ణుడు ఆమె ఓటమికి భయపడి, ఆటను వదిలివేయడానికి లేచిందేమోనని భ్రమ పడ్డాడు. నిజానికి తమ కన్నా పెద్ద వ్యక్తి ఇంట ప్రవేశించినప్పుడు, పైకి లేచి నిలబడడం అప్పటి ఆచారంలో ఒక భాగం. పైగా వచ్చిన వ్యక్తి భర్త, అందులోనూ ఒక రాజు.

కానీ అనాలోచితంగా కర్ణుడు, ఆమె ఓడిపోతున్నందుకు వెళ్లిపోతుందేమో అన్న భ్రమలో

పొరపాటున ఆమె కొంగును పట్టుకోగా, దానికి ఉన్న పూసలు తెగి కింద పడ్డాయి. అయితే ఆ పరిణామం చూస్తున్న దుర్యోధనుడు, సున్నితంగా ” ఆ పూసలను నేను సేకరిస్తే సరిపోతుందా, లేక యధాతధంగా వాటిని కుట్టవలసి ఉంటుందా” అని అన్నాడు. దుర్యోధనునికి, తన స్నేహితుడు, మరియు తన భార్యపై ఉన్న నమ్మకం అలాంటిది.

నిష్పక్షపాత ధోరణి

కర్ణుడు కుంతీ దేవికి, సూర్య భగవానుని అనుగ్రహం వలన కలిగిన సంతానంగా అందరికీ తెలుసు., కానీ రాధేయుని పంచన పెరిగిన కారణంగా, దుర్యోధనుడితో సహా అక్కడ ఉన్న వారందరూ, శూత సంఘానికి చెందినవానిగా కర్ణుని భావించారు. క్రమంగా, కర్ణుని తరచూ అవమానిస్తూ, కులవివక్షను చూపిస్తూ వేధించేవారు. కానీ దీనిని దుర్యోధనుడు ఖండించేవాడు.

నిజానికి ద్రౌపదీ స్వయంవరములో కర్ణుడు, పాల్గొనడానికి ప్రయత్నించినప్పుడు కూడా, ఆమె అతనికి వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచింది. అప్పుడు దుర్యోధనుడు ఈ సంఘటనను ఖండించి బదులుగా ఇలా అన్నాడు “ఒక తత్వవేత్త, ఒక సన్యాసి, యోధుడు కులాన్ని లేదా దాని మూలాలకు వ్యతిరేకంగా ఉంటారు, వారి పుట్టుక గొప్పది కాకపోవచ్చు, కానీ వారు చివరికి గొప్ప వారిగానే మిగులుతారు” అని. కులాల పుట్టుక వ్యర్ధం, కానీ ఆ వ్యర్ధాలే కొందరికి ఇంపు అన్న అభిప్రాయాన్ని కలిగి ఉండేవాడు దుర్యోధనుడు. తన నమ్మకాలు, విశ్వాసాలు కుల భేదాలకు అతీతంగా, సమానత్వాన్ని కూడుకుని ఉండేవి.