NRI-NRT

సింగరేణి నుండి తానా సహాయ కార్యదర్శి దాకా…

murali-talluri-wins-joint-secretary-in-tana-2021-elections

తానా 2021 ఎన్నికల్లో సహాయ కార్యదర్శిగా ఖమ్మం జిల్లా సింగరేణికి చెందిన తాళ్లూరి మురళీ తన సమీప ప్రత్యర్థి కోగంటి వెంకట్‌పై విజయదుందుభి మోగించారు. 1900 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మురళీకి 11277 ఓట్లు లభించగా, వెంకట్‌కు 9377 ఓట్లు దక్కాయి. 2011 నుండి తానాలో చురుగ్గా వ్యవహరిస్తున్న మురళీ గత దశాబ్ద కాలంగా తానాతో పాటు వ్యక్తిగతంగా సేవా కార్యక్రమాలకు మంచి చేయూతనందించారు. టెక్సాస్ రాష్ట్ర ఆస్టిన్‌కు చెందిన ఆయన స్థానికంగా ప్రవాస హిత కార్యక్రమాల ద్వారా సుపరిచితులు. ఆయన ఎన్నిక పట్ల స్థానిక ప్రవాసులు హర్షం వెలిబుచ్చారు.