Business

విజయవాడ నుండి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం

విజయవాడ నుండి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్‌, కువైట్‌, సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. జూన్‌ 1, 2 తేదీలలో ఈ సర్వీసులు ప్రారంభించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సంస్థలు ఈ విమాన సర్వీసులను నడపటానికి ఆసక్తి చూపి స్లాట్‌ కోరాయి. షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజులలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. నెల రోజులుగా విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్‌ను విస్తరిస్తున్నారు. ఈ నెలాఖరుకు విస్తరణ పనులు పూర్తి కాబోతున్నాయి. ఈ దశలో విజయవాడ నుంచి ఒకేసారి మూడు అంతర్జాతీయ విమానాలు ప్రారంభం కానుండటం విశేషం. తాజా పరిణామాలతో తిరిగి గన్నవరం విమానాశ్రయం కళకళలాడే అవకాశాలు ఉన్నాయి.