Business

కరోనా చికిత్సకు ₹5లక్షల పర్సనల్ లోన్-TNI బులెటిన్

కరోనా చికిత్సకు ₹5లక్షల పర్సనల్ లోన్-TNI బులెటిన్

* తెలంగాణ లాక్ డౌన్ పొడిగింపు సమయం ఉదయం 6 నుండి 12 వరకు. ఇది జూన్ 15 వరకు.

* ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మరోమారు ఆగ్రహం.ఆనందయ్య కరోనా మందు పంపిణీపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రభుతాన్ని ప్రశ్నించిన హైకోర్టు.ఆనందయ్య మందు పంపిణీ నిలుపుదలకు సంబంధించి ఆర్డర్స్ ను ఎందుకు ముందుంచలేదన్న ధర్మాసనం.రెండు రోజులు సమయం కోరినప్పటికీ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందు ఉత్తర్వులు ఎందుకు ఉంచలేదన్న రాష్ట్రప్రభుత్వంపై ఆగ్రహం.15 నిమిషాలలో ధర్మాసనం ముందు ప్రభుత్వ ఉత్తర్వులు ఉంచాలని ఆదేశాలు.ఆనందయ్య మందు పంపిణీ విచారణ 15 నిమిషాలు వాయిదా.

* కరోనా సంక్షోభంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్నీ కలిసి కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. కరోనా చికిత్స నిమిత్తం రూ. 5 లక్షల పర్సనల్ లోన్స్ ఇవ్వనున్నాయి. ఈ రుణాల కాలపరిమితి 5 సంవత్సరాలుగా నిర్ణయించారు. తమకు లేదా తమ కుటుంబసభ్యులలో ఎవరికైనా కరోనా సోకితే వారి చికిత్స నిమిత్తం ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చునని ప్రభుత్వ రంగ బ్యాంకులు తెలిపాయి. ఎస్‌బీఐ చీఫ్ దినేష్ ఖారా, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ రాజ్ కిరణ్ రాయ్ ఆదివారం జరిగిన ఓ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

* ఏపీలో కాస్త తగ్గిన కరోనా ఉద్ధృతి నేటి మొత్తం పాజిటివ్ కేసులు 7943

* గాలి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ (సీఏఏక్యూఎంఎస్‌),??రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఎక్యూఐ)ను నిర్ధారిస్తుంది. ..వాటి ప్రకారం గత నెల ఏప్రిల్‌ కర్ప్యూ విధించినప్పటి నుంచి ఎక్యూఐ మితమైన స్థాయి నుంచి సంతృప్తికరమైన స్థాయికి చేరినట్లుగా అధికారులు చెబుతున్నారు…??గాలిలో సల్ఫర్‌ లేదా దాని ఆక్సైడ్‌లు, నత్రజని, దాని ఆక్సైడ్‌లు వంటి సేంద్రియ సమ్మేళనాలు లాక్‌డౌన్‌ కాలంలో తగ్గాయి…??సాధారణ రోజులలో గాలిలో దుమ్ముదూళి కణాలను రెండు రకాలుగా నిర్ధారిస్తారు…..వాటి పరిణామాల అధారంగా 10 మైక్రోమీటర్స్‌ డయామీటర్‌ (వ్యాసం), 2.5 మైక్రోమీటర్స్‌ చెందిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు.??ఈ సంవత్సరం జనవరి నుంచి మే చివరి వరకు వివిధ నెలల్లో గాలి నాణ్యత పరీక్షించడానికి పరీక్షలు చేశారు.